Electric Scooter: హైదరాబాద్ రోడ్లకు బెస్ట్ స్కూటర్ ఇదే.. తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు..

మీరూ హైదరాబాద్ లో ఉంటూ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకిదే బెస్ట్ ఆప్షన్. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్, ఫీచర్లు అన్నింట్లోనూ తిరుగులేని స్కూటర్ ఇది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లిమిట్స్ అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని ఈ స్కూటర్ అందిస్తోంది.

Electric Scooter: హైదరాబాద్ రోడ్లకు బెస్ట్ స్కూటర్ ఇదే.. తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు..
Ola S1 Scooter
Follow us
Madhu

|

Updated on: Jun 24, 2023 | 7:00 AM

మీరూ హైదరాబాద్ లో ఉంటూ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకిదే బెస్ట్ ఆప్షన్. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్, ఫీచర్లు అన్నింట్లోనూ తిరుగులేని స్కూటర్ ఇది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లిమిట్స్ అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని ఈ స్కూటర్ అందిస్తోంది. అయితే అసలు ఈ ఓలా ఎస్1 స్కూటర్లో ఉన్న ఫీచర్లేంటి? ఎంత రేంజ్ ఇస్తుంది? పనితీరు ఎలా ఉంటుంది. బ్యాటరీ చార్జింగ్ కు ఎంత సమయం పడుతుంది? మన మార్కెట్లో ధర ఎంత ఉంటుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

తిరుగులేని ఎలక్ట్రిక్ స్కూటర్లు..

దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి ఓలా స్కూటర్లు. గత రెండేళ్లుగా అత్యధిక విక్రయాలు జరుపుతూ టాప్ ప్లేస్ లో స్థిరంగా కొనసాగుతోంది. ఓలా నుంచి పలు రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఓలా ఎస్ 1 స్కూటర్ కి మాత్రం విశేషమైన ఆదరణ ఉంది. ఓలాలో అత్యధికంగా అమ్ముడైన వాహనం ఇదే. దీనికే ఇంత క్రేజ్ ఎందుకంటే.. మొదటి కారణం దాని రేంజ్. దీనిలోని బ్యాటరీని సింగిల్ చార్జ్ చేస్తే ఏకంగా 141 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని వల్ల చార్జింగ్ టైం తగ్గుతుంది. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులవుగా ప్రయాణించవచ్చు. రెండో కారణం ఏంటంటే దీనిలో మోటార్ ఉత్పత్తి చేసే శక్తి. దీని వల్ల వాహనం వేగంగా ప్రయాణించగలుతుంది. ఈ స్కూటర్ గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. అలాగే ముందు, వెనుక వైపులా డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఓలా ఎస్ 1 సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ట్రాఫిక్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు దూసుకెళ్తుంది.

ఓలా ఎస్1 ధర, లభ్యత..

ఓలా ఎస్ 1 వివిధ రకాల కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అలాగే డిజైన్ కూడా స్టైలిష్ గా ఉంటుంది. ఈ స్కూటర్ బేస్ మోడల్ ధర రూ. 1,29,99(ఎక్స్ షోరూం)గా ఉంది. అదే హైదరాబాద్ లో ఆన్ రోడ్ ధర వచ్చేసి రూ. 1,42,161గా ఉంది. ఇందులోనే ఇన్సురెన్స్ మొత్తం రూ. 8,739, రోడ్ ట్యాక్స్ రూ. 535, హ్యాండ్లింగ్ చార్జీలు జీఎస్టీతో కలిపి రూ. 2,888గా ఉన్నాయి. అదే విధంగా వినియోగదారులకు ఫేమ్ 2 సబ్సిడీ కింద ప్రభుత్వం రూ. 21,916 లను తగ్గిస్తోంది. దీంతో దాని అసలు ధరకే హైదరాబాద్లో స్కూటర్ ని ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..