Positive Pay System: అమల్లోకి వచ్చిన కొత్త రూల్.. పాజిటివ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏమిటి..? కస్టమర్లకు ప్రయోజనమేంటి?

Positive Pay System: ఆగస్టు 1 నుండి దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ (PPS) అమలు చేశాయి. ఈ బ్యాంకులు తమ కస్టమర్లను పిపిఎస్ కింద నమోదు చేసుకోవాలని..

Positive Pay System: అమల్లోకి వచ్చిన కొత్త రూల్.. పాజిటివ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏమిటి..? కస్టమర్లకు ప్రయోజనమేంటి?
Positive Pay System

Updated on: Aug 04, 2022 | 8:13 AM

Positive Pay System: ఆగస్టు 1 నుండి దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ (PPS) అమలు చేశాయి. ఈ బ్యాంకులు తమ కస్టమర్లను పిపిఎస్ కింద నమోదు చేసుకోవాలని కోరాయి. ఈ మేరకు బ్యాంకులు నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. ఐదు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల చెల్లింపునకు రిజర్వ్ బ్యాంక్ ఈ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ నియమాలను పాటించకపోతే బ్యాంక్ చెక్కును క్లియర్ చేయడానికి నిరాకరించవచ్చు. మరి దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. బ్యాంకింగ్ మోసాలను నిరోధించడానికి 2020 సంవత్సరంలో ‘పాజిటివ్ పే సిస్టమ్’ను ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. RBI వెబ్‌సైట్ ప్రకారం.. అధిక విలువ కలిగిన చెక్కుల ప్రధాన వివరాలు సానుకూల చెల్లింపు విధానంలో తిరిగి ధృవీకరించబడతాయి. ఈ ప్రక్రియ కింద చెక్కును జారీ చేసే వ్యక్తి ఎలక్ట్రానిక్‌గా చెక్కు నిర్దిష్ట కనీస వివరాలను బ్యాంకుకు SMS, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM మొదలైన వాటి ద్వారా అందజేస్తారు.

ఉదాహరణకు.. చెక్కు తేదీ, లబ్ధిదారుని పేరు, ఎంత మొత్తం, ఇతర వివరాలు ఈ విధానంలో ఉంటాయి. ఈ వివరాలు ఎలక్ట్రానిక్‌గా ఇమెయిల్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అందించవచ్చు. తర్వాత చెక్‌ క్లియరెన్స్‌లో బ్యాంకు సిబ్బంది చెక్‌తో క్రాస్ చెక్ చేస్తారు. అంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అన్నట్లు. ఇవన్ని వివరాలు సరిపోలితే అప్పుడు చెక్‌ క్లియర్‌ అవుతుంది. లేకపోతే చెక్కును బ్యాంకు సిబ్బంది తిరస్కరిస్తారు. తర్వాత ఈ విషయాన్ని సదరు బ్యాంకు ఖాతాదారునికి తెలియజేస్తారు.

ఇలా చెల్లింపు చేయడానికి మరొక బ్యాంకుకు చెక్కును సమర్పించినప్పుడు, వివరాలు మొదట ధృవీకరించబడతాయి. వివరాలతో సరిపోలిన తర్వాత డిపాజిటర్‌కు నగదు ఇవ్వబడుతుంది. లేకపోతే చెక్కు చెల్లింపు లేకుండా తిరిగి వస్తుంది. ఈ ప్రక్రియను NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. దేశంలోని చాలా బ్యాంకులు ఈ విధానాన్ని అమలు చేశాయి. 50 వేల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపుపై ఆర్‌బిఐ ఈ విధానాన్ని అమలు చేసింది. అయితే 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపుపై బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చింది. చెక్ మొత్తాలకు బ్యాంకులు వేర్వేరు పరిమితులను కలిగి ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ విధానం ద్వారా ప్రయోజనం ఏంటి..?

ఈ కొత్త విధానంతో చెక్కు మోసాలకు అడ్డుకట్ట పడనుంది. వెరిఫికేషన్, ప్రామాణీకరణ, ప్రత్యేక స్థాయిలను కలిగి ఉండటం చెక్ ద్వారా లావాదేవీ భద్రతను మెరుగుపరుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ చాలా కాలం క్రితం ఈ వ్యవస్థ గురించి తెలిపినా.. దీన్ని అమలు చేయడానికి బ్యాంకులకు సమయం ఇచ్చింది. ఎట్టకేలకు ఆగస్టు నుంచి ఈ విధాపం అమల్లోకి వచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి