మార్కెట్ లో మీరు ఊహించిన విధంగా రాబడి రావడం లేదా? మీరు మీ SIP పెట్టుబడులను కొంత కాలం హోల్డ్ చేయడం ఉత్తమం. మీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ని హోల్డ్‌లో ఉంచడానికి ప్లాన్ చేస్తుంటే అందుకు సరైన సమయం ఎఫ్పుడో తెలుసుకోండి.
ఇన్వెస్ట్‌మెంట్‌లలో విరామం అనేది చాలా ముఖ్యం. SIP సిస్టంలో కూడా ఇది అందుబాటులో ఉందన్న విషయం చాలా మంది పెట్టుబడిదారులకు తెలియదు. కానీ దీన్ని పాజ్ ఫీచర్ అంటారు. అయితే చాలా మంది దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు తరచుగా SIP పెట్టుబడులను నిలిపివేయడానికి, పాజ్ ఫంక్షన్‌ని ఉపయోగిస్తారు. అయితే, ఇది ప్రతీసారి మంచి నిర్ణయం కాదు.
మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు వారి SIPను కొనసాగించాలి. మార్కెట్ కనిష్ట స్థాయిలలో పెట్టుబడిని కొనసాగించడం వలన పెట్టుబడిదారులకు ప్రయోజనం కలుగుతుంది. చివరికి దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు.
అయితే, తాత్కాలికంగా డబ్బు కొరత లేదా ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో మాత్రమే SIPలో పాజ్ ఫీచర్ ఉపయోగించాలి. మీ SIP పెట్టుబడిని కొంతకాలం పాజ్ చేయడం వలన మీరు మీ ఆర్థిక స్థితిని గుర్తించవచ్చు. మీ ఖాతాలో మీకు అవసరమైన నిధులు ఉన్నప్పుడు, మీరు మీ SIP పెట్టుబడిని కొనసాగించవచ్చు.
సిప్ పాజ్ చేయడం బెటర్ ఆప్షన్ అవతుందా..?
మీరు అకస్మాత్తుగా SIP చేయడం ఆపివేస్తే, మీరు నిర్మించుకుంటున్న ఆర్థిక లక్ష్యం మధ్యలోనే ఆగిపోతుంది. దాని ప్రయోజనాన్ని కోల్పోతారు. అత్యవసర కారణాల వల్ల, మీ SIPని పూర్తిగా ఆపివేయడం కంటే పాజ్ చేయడం ఎల్లప్పుడూ ఉత్తమం.
SIP పాజ్ ఎంపిక కోసం కీలక సిఫార్సులు:
ఇటీవలి కాలంలో, అనేక అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు), ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు SIP పాజ్ ఫంక్షన్ ప్రక్రియను పరిచయం చేశాయి. ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా మానేసినట్లయితే, స్టాక్ మార్కెట్ తో మీ బంధం పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది, అందుకే మీ కనెక్షన్‌ను కొనసాగిస్తూనే ఈ పాజ్ ఎంపిక అందుబాటులో ఉంటుంది. ఒక నెల నుండి ఆరు నెలల ఈ సిప్ పాజ్ ఆఫ్షన్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ సేవను ఉపయోగించుకోవడానికి, మీరు SIP గడువుకు 10-15 రోజుల ముందు పెట్టుబడిని నిలిపివేయమని మీ అభ్యర్థనను సమర్పించాలి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చాలా సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది దాని ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. SIP పెట్టుబడిని ఎప్పుడైనా మార్చుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఈక్విటీల ఫండ్స్‌లో డబ్బుని కలిగి ఉన్నప్పటికీ, అస్థిరత కారణంగా డెట్ ఫండ్‌లకు మారాలనుకుంటే, మీరు ప్రస్తుతానికి డెట్ ఫండ్ వైపు వెళ్లవచ్చు.
మార్కెట్ పడిపోతున్న సమయంలో SIP హోల్డింగ్‌లను రీబ్యాలెన్స్ చేసే అవకాశం మీకు సిప్ పాజ్ ఆఫ్షన్ ద్వారా జరుగుతుంది. మీరు వేర్వేరు ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్‌లోని కఠిన పరిస్థితిని తట్టుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయడానికి ఎంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..