Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF Investment: కోటీశ్వరుడు అవ్వడమే మీ టార్గెట్టా? పీపీఎఫ్‌ పెట్టుబడితో సాధ్యం చేసుకోండిలా..!

కచ్చితమైన ప్రణాళికతో దీర్ఘకాలిక పెట్టుబడులు క్రమంగా మీరు రూ. 1 కోటి కంటే ఎక్కువ కార్పస్ ఫండ్‌ను రూపొందించడానికి దారి తీస్తుంది. ముఖ్యంగా మీరు వేతన జీవవి అయితే మీ ఉపాధి ప్రారంభ దశలోనే పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత మంచి రాబడిని మీరు ఆశించవచ్చు. మిమ్మల్ని 25 ఏళ్లలో మిలియనీర్‌గా మార్చే ప్రభుత్వ పథకం ఉంది. అదే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌).

PPF Investment: కోటీశ్వరుడు అవ్వడమే మీ టార్గెట్టా? పీపీఎఫ్‌ పెట్టుబడితో సాధ్యం చేసుకోండిలా..!
Ppf
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 06, 2023 | 10:20 PM

కోటీశ్వరుడు అవ్వడం అనేది భారతీయుల్లో చాలా మంది కల. అయితే అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఈ కలను సాకారం చేసుకోవడానికి పెట్టుబడి పెట్టడం అనేది ఉత్తమ మార్గాలలో ఒకటిగా ఉంటుంది. కచ్చితమైన ప్రణాళికతో దీర్ఘకాలిక పెట్టుబడులు క్రమంగా మీరు రూ. 1 కోటి కంటే ఎక్కువ కార్పస్ ఫండ్‌ను రూపొందించడానికి దారి తీస్తుంది. ముఖ్యంగా మీరు వేతన జీవవి అయితే మీ ఉపాధి ప్రారంభ దశలోనే పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత మంచి రాబడిని మీరు ఆశించవచ్చు. మిమ్మల్ని 25 ఏళ్లలో మిలియనీర్‌గా మార్చే ప్రభుత్వ పథకం ఉంది. అదే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌). పీపీఎఫ్‌ పెట్టుబడితో కోటీశ్వరుడిగా ఎలా మారాలో? తెలుసుకుందాం.

పీపీఎఫ్‌ పథకం మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా సాంప్రదాయ పొదుపు సాధనాలతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది. పీపీఎఫ్‌ అనేది ఒక ఇష్టమైన పెట్టుబడి ఎంపిక. ఎందుకంటే మీరు డిపాజిట్ చేసే డబ్బు, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం. ప్రభుత్వ మద్దతు ఉన్నందున ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉంటుంది. భాగస్వామ్య బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్‌ ఖాతాను తెరవవచ్చు కాబట్టి ఈ పథకాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

పీపీఎఫ్‌ వడ్డీ రేటు, మెచ్యూరిటీ వ్యవధి

పీపీఎఫ్‌ పథకంలో మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్‌ ఖాతాకు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. బ్యాంకులు, పోస్టాఫీసులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే పీపీఎఫ్‌ అధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఏప్రిల్ 1, 2023 నాటికి పీపీఎఫ్‌ 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మీరు గరిష్టంగా 15 సంవత్సరాల వరకు పీపీఎఫ్‌ ఖాతాను తెరవవచ్చు. మీరు మెచ్యూరిటీ తర్వాత కూడా దీన్ని కొనసాగించాలనుకుంటే, మీరు దానిని 5 సంవత్సరాల బ్లాక్‌లలో పొడిగించవచ్చు.

ఇవి కూడా చదవండి

పీపీఎఫ్‌తో కోటి రూపాయల సంపాదించడం ఇలా

నిరాడంబరమైన నెలవారీ పెట్టుబడి కూడా మిమ్మల్ని మిలియనీర్‌గా చేస్తుంది. మీరు ప్రతి నెలా రూ. 12,500 మాత్రమే పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయడం ద్వారా సాధ్యం అవుతుంది. ఇలా పెట్టుబడి పెడితే ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుని రూ. 1.03 కోట్ల కార్పస్ ఫండ్‌ను రూపొందించవచ్చు. అయితే మీరు 25 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ మొత్తం పెట్టుబడి దాదాపు రూ. 37.5 లక్షల వరకు ఉంటుంది. అయితే వడ్డీ భాగం దాదాపు రూ. 65.58 లక్షలకు చేరుకుంటుంది. ఇది పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం కంటే దాదాపు రెట్టింపు. ఇలా పెట్టుబడి సూత్రాన్ని అమలు చేయడం ద్వారా కోటీశ్వరులుగా మారవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి