AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: ఐఆర్‌సీటీసీ జపాన్ టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే.. మొత్తం 10 రోజులు..

జపాన్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకు ఐఆర్‌సీటీసీ మంచి అవకాశం కల్పిస్తోంది. 10 రోజుల జపాన్ టూర్ ప్రత్యక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్‌లో భాగంగా జపాన్‌లోని ఏడు నగరాలను సందర్శించవచ్చు. అలాగే బుల్లెట్ రైళ్లల్లో ప్రయాణం చేయవచ్చు. ఢిల్లీ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది.

IRCTC: ఐఆర్‌సీటీసీ జపాన్ టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే.. మొత్తం 10 రోజులు..
Irctc
Venkatrao Lella
|

Updated on: Aug 09, 2026 | 9:29 AM

Share

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునేవారి కోసం అదిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ సారి జపాన్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 10 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. ఢిల్లీ నుండి ఈ టూర్ ప్రారంభం కానుండగా.. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లోని టోక్యో, హకోనే, హమామత్సు, క్యోటో, ఒసాకా, నారా, హిరోషిమా నగరాలను సందర్శించవచ్చు. అంతేకాకుండా బుల్లెట్ ట్రైన్లల్లో కూడా ప్రయాణం చేయవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ధరలు, ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చు.. ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.

జపాన్ పర్యటన వివరాలు

ఈ పర్యటన 2026 సెప్టెంబర్ 6న ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి టోక్యోకు ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణిస్తారు. NH838 విమానం ఢిల్లీ నుండి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5:55 గంటలకు టోక్యో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 15న ఉదయం 11:10 గంటలకు టోక్యో నుండి బయలుదేరి.. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఈ టూర్‌లో భాగంగా జపాన్‌లోని ఏడు నగరాల్లోని అనేక ప్రసిద్ధ ఆకర్షణలను సందర్శిస్తారు.

ఏయే ప్రదేశాలు చూడవచ్చు..

-టోక్యో: అసకుసా దేవాలయం, నకమిసే డోరి, ఇంపీరియల్ ప్యాలెస్, టోక్యో టవర్, ఉయెనో పార్క్, ఒడైబా టీమ్‌ల్యాబ్ ప్లానెట్స్

-హకోన్, ఫ్యూజీ పర్వతం: ఫ్యూజీ పర్వత 5వ స్టేషన్, ఓవాకుదాని లోయ, హకోన్ రోప్‌వే, హకోన్ పైరేట్ షిప్

-నగోయా: టయోటా మ్యూజియం, SCMAGLEV రైల్వే పార్క్

-క్యోటో: అరాషియామా వెదురు అడవి, కింకాకు-జి ఆలయం, ఫుషిమి ఇనారి తైషా

-నారా: నారా డీర్ పార్క్, తోడై-జి టెంపుల్

-ఒసాకా: ఒసాకా కాజిల్ పార్క్

-హిరోషిమా: హిరోషిమా శాంతి స్మారక పార్క్, ఇత్సుకుషిమా పుణ్యక్షేత్రంతో సహా మియాజిమా ద్వీపం

-టోక్యో: టోక్యో స్కైట్రీ (350 మీ)

-షిన్-ఒసాకా నుండి హిరోషిమాకు (సెప్టెంబర్ 13న), హిరోషిమా నుండి టోక్యోకు (సెప్టెంబర్ 14న) బుల్లెట్ రైలు ప్రయాణాలు

ప్యాకేజీ ధర ఎంతంటే..?

ఢిల్లీ నుండి IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ వసతి ఎంపికను బట్టి వేర్వేరు ధరలలో లభిస్తుంది. ట్రిపుల్-షేరింగ్ ప్యాకేజీకి ఒక్కో వ్యక్తికి సుమారు రూ. 3.46 లక్షలు (రూ. 3,45,999) ఖర్చవుతుంది. ట్విన్, డబుల్-షేరింగ్ ప్యాకేజీకి రూ. 3,49,999 ఖర్చవుతుంది. సింగిల్-ఆక్యుపెన్సీ ప్యాకేజీకి రూ. 4,73,999 ఖర్చవుతుంది. 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ ప్యాకేజీ ధర మంచంతో రూ. 2,92,499, మంచం లేకుండా రూ. 2,63,999తో లభిస్తుంది.

Follow Us