AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interim Budget: నిర్మలమ్మ పద్దు రెడీ.. ఆ ఆరు అంశాలపైనే ఆశలన్నీ..!

ఆర్థిక మంత్రి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి  అద్భుతమైన ప్రకటన ఉండదని ఇప్పటికే పేర్కొన్నా మార్కెట్ పరిశీలకులు, పెట్టుబడిదారులు ఇంకా కొన్ని ప్రధాన ప్రకటనలను ఆశిస్తున్నారు.  ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌లో మంచి వార్త అందించే ఆరు కీలక రంగాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

Interim Budget: నిర్మలమ్మ పద్దు రెడీ.. ఆ ఆరు అంశాలపైనే ఆశలన్నీ..!
Budget
Nikhil
|

Updated on: Jan 29, 2024 | 2:01 PM

Share

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌నుసమర్పించనున్నారు. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రకటిస్తారు. ఆర్థిక మంత్రి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి  అద్భుతమైన ప్రకటన ఉండదని ఇప్పటికే పేర్కొన్నా మార్కెట్ పరిశీలకులు, పెట్టుబడిదారులు ఇంకా కొన్ని ప్రధాన ప్రకటనలను ఆశిస్తున్నారు.  ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌లో మంచి వార్త అందించే ఆరు కీలక రంగాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

  1. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేకించి విరాళాలు, ఉపసంహరణలపై పన్ను రాయితీలను పొడిగించడం ద్వారా ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌)ని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు.
  2. పింఛన్‌ ఫండ్‌ రెగ్యూలేటర్‌, యజమానుల విరాళా కోసం పన్నుల విషయంలో ఉద్యోగుల ప్రావిండెంట్‌ ఫండ్‌ ఆఫీస్‌ సమానత్వం కోరింది. దీనికి సంబంధించిన కొన్ని ప్రకటనల మధ్యంతర బడ్జెట్‌లో చేయవచ్చని భావిస్తున్నారు. 
  3. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు గణనీయంగా పెంచడంతో పాటు అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణాలు అందుబాటులో ఉండేలా కేంద్రం రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి. 
  4. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, ఉపాధిని కల్పించడానికి, ప్రభుత్వం రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో వస్త్రాలు, నగలు, హస్తకళల వంటి రంగాలను చేర్చడానికి పీఎల్‌ఐ పథకానికి సంబంధించి పరిధిని విస్తరించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 
  5. పేద రైతుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేయడం ద్వారా వారి సంరక్షణను తీసుకున్న ప్రభుత్వం పన్నుల నిర్మాణంలో న్యాయబద్ధతను తీసుకురావడానికి ధనిక రైతులపై ఆదాయపు పన్ను విధించాలని ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 
  6. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి కార్పొరేట్‌లకు కొత్త తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన 15 శాతం ఆదాయపు పన్ను రేటును ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చని పేర్కొంటున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి