India Post Payments Bank: ఇండియన్ పోస్టల్ శాఖలో రకరకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కేవలం పోస్టు కార్డులు, ఇతర పోస్టులకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చే పోస్టల్ శాఖ.. ఇప్పుడు కస్టమర్ల కోసం రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు కస్టమర్ల డబ్బుల జమపై వడ్డీలు చెల్లించడం, వివిధ రకాల పెట్టుబడులపై అధిక రాబడి అందించే విధంగా స్కీమ్‌లను తీసుకువస్తోంది. అలాగే బ్యాంకుల మాదిరిగానే పోస్టల్ పేమెంట్స్‌పై కూడా వడ్డీలు అందిస్తోంది. అయితే మీకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా ఉన్నట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంది. బ్యాంక్ ఖాతాదారులకు కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఆగస్ట్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. దీంతో ఈ నిబంధనల కారణంగా చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది.
ఆగస్టు నుంచి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం.. ఐపీపీబీ కస్టమర్లు ఆగస్ట్ 1 నుంచి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వచ్చే నెల 1 నుంచి మాత్రం చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐపీపీబీ కస్టమర్లకు మరో షాక్ కూడా ఇచ్చింది. ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా కలిగిన వారికి గతంలో 2.75 శాతం వడ్డీ వచ్చేది. కానీ ఇప్పుడు 2.5 శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. అంటే వడ్డీ రేట్లును తగ్గించింది. ఇకపోతే పోస్టాఫీస్ ఖాతాదారులు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులను, ఇతర ఆర్థిక సేవలను ఇప్పుడు ఐపీపీబీ యాప్ ద్వారానే పొందొచ్చు. పోస్టాఫీస్ బ్రాంచుకు వెళ్లాల్సి న అవసరం ఉండదు. మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.