Instagram Update: ఇకపై మీ ఫ్రెండ్స్ లొకేషన్ తెలుసుకోవడం ఈజీ! ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చేస్తే చాలు!

మీ ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇన్‌స్టాగ్రామ్ లో ఉన్న ఈ ఫీచర్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌ రీసెంట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ తీసుకొచ్చింది. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Instagram Update: ఇకపై మీ ఫ్రెండ్స్ లొకేషన్ తెలుసుకోవడం ఈజీ! ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చేస్తే చాలు!
Instagram Update

Updated on: Oct 26, 2025 | 2:32 PM

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపయోగించే ఇన్‌స్టాగ్రామ్ లో చాలామందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఫ్రెండ్స్ లొకేషన్ తెలుసుకునే ఫీచర్ గురించి చాలామందికి తెలియదు. అసలు ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? దాన్ని యాక్సెస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెండ్స్‌ మ్యాప్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో గతంలో వచ్చిన ఒక అప్‌డేట్‌తో రీల్స్ డ్యూరేషన్ మూడు నిముషాల వరకూ పెరిగింది. అలాగే కొన్ని కొత్త యూఐ డిజైన్ మార్పులు కూడా వచ్చాయి. వీటితో పాటు, “ఫ్రెండ్స్ మ్యాప్” అనే  కొత్త ఫీచర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి వచ్చింది.  అయితే ఇది మొదటగా అమెరికాలో అందుబాటులో ఉండేది. ఇండియాలో ఈ ఫీచర్ కనిపించలేదు. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ఫీచర్ ఎనేబుల్ అవ్వబోతోంది అంటున్నారు. ఈ ఫీచర్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రాసెస్‌ ఇలా..

ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ స్నాప్‌చాట్‌లోని “స్నాప్ మ్యాప్” లాగానే ఉంటుంది. ఇది మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారో రియల్ టైమ్‌లో చూడటానికి వీలు కల్పిస్తుంది.  ఈ ఫీచర్ ను యాక్సెస్ చేయడం కోసం ముందుగా ఇన్ స్టాగ్రామ్ యాప్ ను అప్ డేట్ చేయాలి.  ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి.. మెసేజ్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ టాప్ లో ఫ్రెండ్స్ మ్యాప్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రియల్ టైం మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్ లో మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ కనిపించాలంటే  ఇన్ స్టాగ్రామ్ యాప్ కు లొకేషన్ యాక్సెస్ ఇచ్చి ఉండాలి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫోన్ లో కూడా పర్మిషన్ ఎనేబుల్ చేసి ఉండాలి.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..