Indigo Offers: అదిరేలా ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్లు.. రెండు రోజులే అవకాశం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే ఫీవర్ నడుస్తుంది. తాము ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ప్రేమికులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక రోజును మరింత ప్రత్యేకం చేసేందుకు కొన్ని కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో ప్రయాణికులకు అదిరే వాలెంటైన్స్ డే ఆఫర్‌ను ప్రకటించింది.

Indigo Offers: అదిరేలా ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్లు.. రెండు రోజులే అవకాశం
Indigo Offers

Updated on: Feb 13, 2025 | 11:20 AM

ఇండిగో లవ్ సీజన్‌ను ప్రత్యేక వాలెంటైన్స్ డే సేల్‌తో జరుపుకుంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రత్యేక డిస్కౌంట్‌లతో ప్రేమ జంటలు ప్రశాంతంగా ప్రయాణించేందుకు అనువుగా ప్లాన్స్‌ను రూపొందించినట్లు వివరిస్తున్నారు. ఈ ఆఫర్లలో భాగంగా ఇద్దరు ప్రయాణీకులకు బుకింగ్‌లపై బేస్ ఛార్జీలపై 50 శాతం వరకు డిస్కౌంట్లను ఎయిర్‌లైన్ ప్రకటించింది.  ఈ పరిమిత కాల ఆఫర్ ఫిబ్రవరి 12, 2025 (00:01 గంటలు) నుంచి ఫిబ్రవరి 16, 2025 (23:59 గంటలు) వరకు ఎంపిక చేసిన దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు బుకింగ్ తేదీ తర్వాత కనీసం 15 రోజులు ఉండాలి.

ఇండిగో వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఇండిగో 6ఈ స్కై, ఇష్టపడే ప్రయాణ భాగస్వాములతో సహా బహుళ బుకింగ్ ఛానెల్‌ల ద్వారా కస్టమర్‌లు ఈ డిస్కౌంట్‌లను పొందవచ్చు. విమాన ఛార్జీలతో డిస్కౌంట్‌లతో పాటు ఇండిగో వివిధ రకాల ప్రయాణ యాడ్-ఆన్‌లపై తగ్గింపులను అందిస్తుంది. ప్రయాణికులు నిర్దిష్ట మార్గాల్లో దేశీయ, అంతర్జాతీయ విమానాల కోసం ప్రీ-పెయిడ్ అదనపు సామగ్రి చార్జీలపై 15 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు, అలాగే ప్రామాణిక సీట్ల ఎంపికపై 15 శాతం తగ్గింపును పొందవచ్చు. అదనపు సౌకర్యాన్ని ఇష్టపడే వారికి దేశీయ సెక్టార్‌లకు రూ.599, అంతర్జాతీయ మార్గాలకు రూ.699 నుండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్స్‌ఎల్ సీట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ముందస్తుగా బుక్ చేసుకున్న భోజనాలపై 10 శఆతం తగ్గింపును కూడా అందిస్తోంది

ముఖ్యంగా ఫాస్ట్ ఫార్వర్డ్ సేవలపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. 6ఈ ప్రైమ్, 6ఈ సీట్ & ఈట్ వంటి ఇండిగో బండిల్డ్ సేవలపై 15 శాతం వరకు అదనపు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అదనపు ప్రోత్సాహకంగా ఇండిగో ఫిబ్రవరి 14, 2025న ‘ఫ్లాష్ సేల్’ను నిర్వహిస్తుంది. ఆ రోజు మొదటి 500 బుకింగ్‌లకు అమ్మకపు ధరపై అదనంగా 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్ ప్రేమికుల రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లోని బుకింగ్స్‌పై ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి