Independence Day: రూ. వెయ్యితో విమానం ఎక్కొచ్చు.. త్వరపడండి.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..

ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా ఫ్రీడమ్ సేల్ ని ప్రకటించింది. ఆగస్టు 13 నుంచి ఈ సేల్ ప్రారంభమైంది. ఈ రోజు అంటే ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ఇండిగో తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇండిగో ఫ్రీడమ్ సేల్లో మీరు విమాన టికెట్ ను కేవలం రూ. 1015కే కొనుగోలు చేయొచ్చు.

Independence Day: రూ. వెయ్యితో విమానం ఎక్కొచ్చు.. త్వరపడండి.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..
Indigo Airlines
Follow us
Madhu

|

Updated on: Aug 15, 2024 | 12:06 PM

విమాన ప్రయాణం అంటే ఇష్టం ఉండని ఎవరుంటారు చెప్పండి. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే విమాన చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, పండుగలప్పుడు విమానయాన సంస్థలు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. స్వాంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. అదే కోవలో ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా ఫ్రీడమ్ సేల్ ని ప్రకటించింది. ఆగస్టు 13 నుంచి ఈ సేల్ ప్రారంభమైంది. ఈ రోజు అంటే ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ఇండిగో తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇండిగో ఫ్రీడమ్ సేల్లో మీరు విమాన టికెట్ ను కేవలం రూ. 1015కే కొనుగోలు చేయొచ్చు. అలాగే కొన్ని యాడ్ ఆన్స్ పై 15శాతం ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇండిగో ఫ్రీడమ్ సేల్..

ఇండిగో ఫ్రీడమ్ సేల్ లో ప్రయాణికులకు విమాన ఛార్జీలు, అదనపు సేవలపై గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. హెడ్‌లైన్ ఆఫర్ దేశీయ విమానాలకు రూ. 1,015 నుంచి ప్రారంభమవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులను సందర్శించడానికి లేదా సెలవు తీసుకోవడానికి ప్లాన్ చేసే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికులను కూడా అదిరే డిస్కౌంట్ ను అందిస్తోంది. అన్నీ కలుపుకొని వన్-వే ఛార్జీలు రూ. 3,715 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన బుకింగ్‌లకు మాత్రమే ఈ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి.

మరో 15శాతం తగ్గింపు..

ఇండిగో ఎంపిక చేసిన 6ఈ యాడ్-ఆన్‌లపై ఫ్లాట్ 15% తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ యాడ్-ఆన్‌లలో సీటు ఎంపిక, అదనపు సామాను, ఫాస్ట్ ఫార్వార్డ్, క్రీడా పరికరాల నిర్వహణ వంటి సేవలు ఉన్నాయి.

సమయం లేదు..

ఫ్రీడమ్ సేల్ అద్భుతమైన డీల్‌లను అందిస్తున్నప్పటికీ, బుకింగ్ వ్యవధి చాలా తక్కువ ఉంది. ఈ రోజు అర్ధరాత్రి అంటే ఆగస్టు 15, 2024న 23:59 గంటల వరకు మాత్రమే సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ లోపే టికెట్లు బుక్ చేసుకోవాలి. ప్రయాణికులు 2024 ఆగస్టు 22 నుంచి 2025 మార్చి 31 మధ్య ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ధరలకు అదనంగా కొన్ని ట్యాక్సులు, ఎక్స్ ట్రా చార్జీలు ఉంటాయి. వన్ వే, రౌండ్ ట్రిప్ బుకింగ్స్ మాత్రమే డిస్కౌంట్ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..