రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..! డాలర్‌తో పోలిస్తే ఇప్పుడు ఎన్ని రూపాయలంటే..?

అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 87.97కి పడిపోయింది, ఇది రికార్డు కనిష్టం. ఎగుమతి-ఆధారిత పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోదీ రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల వల్ల భారత ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..! డాలర్‌తో పోలిస్తే ఇప్పుడు ఎన్ని రూపాయలంటే..?
Indian Rupee Depreciation

Updated on: Aug 29, 2025 | 4:12 PM

భారతదేశ ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ ఆదాయాలపై 50 శాతం అమెరికా సుంకాల ప్రభావంపై ఉద్రిక్తత మధ్య భారత రూపాయి యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే 87.97కి పడిపోయింది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్టం. ఈ వారం నుండి అమలు చేయనున్న కొత్త US సుంకాల కారణంగా భారత కరెన్సీ ఒత్తిడిలో ఉంది. అయితే ఫిబ్రవరిలో దాని మునుపటి ఆల్-టైమ్ కనిష్ట స్థాయి 87.9563 ను అధిగమించి, డాలర్‌తో పోలిస్తే కరెన్సీ 0.4 శాతం తగ్గి 87.9763 కు చేరుకుంది.

ఈ సంవత్సరం స్థానిక ఈక్విటీల నుండి నిరంతరం విదేశీ ఉపసంహరణల కారణంగా రూపాయి ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. వస్త్రాలు, పాదరక్షలు, ఆభరణాలు వంటి ఎగుమతి-ఆధారిత పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని యూఎస్‌ సుంకాలను ప్రధానంగా పెంచారు. అయితే అమెరికా సుంకాలను తట్టుకొని నిలబడుతూ.. తమ రైతుల, వ్యాపారలను రక్షించుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రకటించారు.

కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతోనే భారత్‌పై భారీ సుంకాలు విధించినట్లు అమెరికా చెబుతోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం ఆపితేనే సుంకాలు తొలగిస్తామని ఇప్పటికే ట్రంప్‌ భారత్‌ను హెచ్చరించారు. ట్రంప్‌ వార్నింగ్‌ను ఏ మాత్రం లెక్కచేయని ప్రధాని మోదీ, రష్యాతో వాణిజ్యం కొనసాగుతుందని ప్రకటించారు. మరి ఈ క్రమంలో రుపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. మరి దీని నుంచి భారత రుపాయి ఎలా కొలుకుంటుందో చూడాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి