ప్రతీ రోజూ ఎంతోమంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది ఇండియన్ రైల్వేస్. సుందరమైన ప్రకృతి దృశ్యాల దగ్గర నుంచి రమణీయమైన గ్రామీణ ప్రాంతాల వరకు అన్నింటిని ప్రయాణీకుడి కళ్ల ముందుకు తీసుకొస్తాయి రైల్వేస్. ఇక రైళ్లలో కొందరు ఒక గంట పాటు ప్రయాణిస్తే.. ఇంకొందరు ఎనిమిది గంటలు.. మరికొందరు ఒకట్రెండు రోజుల పాటు ప్రయాణిస్తుంటారు. దేశంలో అత్యంత తక్కువ దూరమైన రైలు ప్రయాణం ఉంటే.. అలాగే పొడవైన రైలు మార్గం కూడా ఉంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వివేక్ ఎక్స్‌ప్రెస్.. భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ప్రయాణించే రైలు ఇది. ఈ ట్రైన్ అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు నడుస్తుంది. దాదాపు 4,200 కి.మీ ప్రయాణించే ఈ రైలు వారానికి ఒకసారి పట్టాలెక్కుతుంది. అలాగే ఈ చుక్‌చుక్ బండి తన గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ రైలు దాదాపుగా 59 స్టాప్‌లలో ఆగుతుంది. 19 కోచ్‌లు ఉన్న ఈ ట్రైన్ 9 రాష్ట్రాల గుండా ప్రయాణించి.. 4 రోజుల్లో తన గమ్యస్థానానికి చేరుతుంది. ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశంలోని విభిన్న భౌగోళిక దృశ్యాలను చూపిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి