Market Update: నిన్న ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రానికి నష్టాలతో ముగిశాయి. ప్రారంభంలోనే 600 పాయింట్ల పతనంతో ప్రారంభమైన సెన్సెక్స్ సూచీ 10.30 సమయానికి 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇదే సమయంలో మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ ఆరంభంలో 150 పాయింట్లకు పైగా నష్టపోగా..10.30 సమయానికి 325 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 1.91 శాతం, మిడ్ క్యాప్ సూచీ 1.64 శాతం మేర పతనమయ్యాయి. రూపాయి మారకపు విలువ శైతం 15 పైసల మేర పతనమైంది.
ప్రధానంగా నిఫ్టీ ఎఫ్ఎమ్సీజీ సూచీలో కంపెనీలైన యూబీఎల్ 5.08%, హిందుస్థాన్ యూనీలివర్ 4.11%, విబిఎల్ 3.42%, టాటా కన్జూమర్ 3.39%, మెక్ డోవెల్స్ 2.75% మేర పతనమై ముందు వరుసలో నిలిచాయి. బ్యాంకింగ్ దిగ్గజాలైన ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు మరిన్ని బ్యాంకులు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న రంగాలు..
ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎమ్సీజీ, హెల్త్, ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తో పాటు ఫార్మా సూచీలు నెటటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇలా మార్కెట్ లోని అన్ని ప్రధాన రంగాలు వారాంతంలో నేల చూపులు చూస్తున్నాయి. వీటి కారణంగా మదుపరుల సంపద లక్షల కోట్లలో ఆవిరవుతోంది. అసలు మార్కెట్లు ఎప్పటికి తిరిగి సాధారణ స్థితికి వస్తాయి.. యుద్ధ భయాలు, ప్రభావం ఎప్పటికి తొలగిపోతుందనే అంశాలపై చాలా మంది ఇన్వెస్టర్లలో ప్రశ్నగా మారింది. దీని వల్ల వారు తమ పెట్టుబడులను ఎక్కువగా ఉపసంహరించుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి..
Russia Ukraine War: అణు విద్యుత్తు కేంద్రంపై బాంబుల వర్షం.. వీడియోను విడుదల చేసిన ఉక్రెయిన్..