Indian Railways: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. సిక్కు తీర్థయాత్రకు గురుకృపా రైలు.. ప్యాకేజీ వివరాలు

ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త ప్యాకేజీలను ప్రవేశపెడుతూ ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందిస్తోంది. ఇక పర్యాటకులను..

Indian Railways: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. సిక్కు తీర్థయాత్రకు గురుకృపా రైలు.. ప్యాకేజీ వివరాలు
Irctc

Updated on: Feb 21, 2023 | 8:18 PM

ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త ప్యాకేజీలను ప్రవేశపెడుతూ ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందిస్తోంది. ఇక పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఐఆర్‌సీటీసీ ఎప్పకటిప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతూ విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని ప్రయాణికులకు కలుగజేస్తూ ఉంటుంది. ఇక హిందూ తీర్థయాత్రల కోసం ప్రత్యేక భారత్ గౌరవ్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వేలు, ఐఆర్‌సీటీసీ సిక్కుల కోసం ముఖ్యమైన ప్రదేశాలకు ప్రత్యేక రైలు సర్వీసును నడపడానికి సిద్ధంగా ఉన్నాయి. గురుకృపా రైలు ఏప్రిల్ 5నఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుండి ప్రారంభమవుతుంది. అలాగే పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్‌లోని గురుద్వారాలు, పంచ తక్త్‌లకు యాత్రికులను తీసుకువెళుతుంది.ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్, పిలిభిత్, బరేలీలోని గురుద్వారాలకు యాత్రికులను తీసుకెళ్లే గురుకృపా యాత్ర రైలును ఐఆర్‌సీటీసీ నడుపుతుందని రైల్వే బోర్డు తెలిపింది.

ఎంత మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు:

భారతీయ రైల్వేలు ప్రారంభించిన గురుకృపా ప్రయాణ ప్యాకేజీ ప్రయాణం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుండి ప్రారంభమవుతుంది. ఇది ఏప్రిల్ 5న ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మొత్తం 678 మంది భక్తులు ప్రయాణించవచ్చు. ఈ రైలులో మొత్తం 9 స్లీపర్ కోచ్‌లు, 1 ఏసీ-3 కోచ్, 1 ఏసీ-2 కోచ్ ఉంటాయి. ఈ మొత్తం ప్యాకేజీని స్టాండర్డ్, సుపీరియర్, కంఫర్ట్ అనే మూడు వర్గాలుగా విభజించారు. మీరు ప్రయాణించే కేటగిరీని బట్టి చెల్లించాల్సి ఉంటుంది.

ప్యాకేజీ వివరాలు:

ప్యాకేజీ పేరు- గురుకృపా యాత్ర

ఇవి కూడా చదవండి
  • ప్రయాణ వ్యవధి – 11 రోజులు, 10 రాత్రులు
  • పర్యటన తేదీ – 5 ఏప్రిల్, 2023 నుండి 15 ఏప్రిల్, 2023 వరకు
  • బోర్డింగ్/డీబోర్డింగ్ స్టేషన్-లక్నో, సీతాపూర్, పిలిభిత్, బరేలీ

ఫీజు ఎంత ఉంటుంది

మీరు స్టాండర్డ్ అంటే స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తే, ఒక వ్యక్తికి రూ. 24,127 మరియు ఇద్దరికి రూ. 19,999 చెల్లించాలి.
సుపీరియర్ అంటే ఏసీ 3లో ప్రయాణించే వారు ఒంటరిగా వెళ్లేందుకు రూ.36,196, ఇద్దరు వ్యక్తులకు రూ.2,999 చెల్లించాల్సి ఉంటుంది.
కంఫర్ట్ క్లాస్ అంటే AC 2లో ప్రయాణించడానికి, ఒక ప్రయాణికుడు రూ. 48,275 చెల్లించాలి మరియు ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ. 39,999 చెల్లించాలి.

 సందర్శించే గురుద్వారాలు

  • ఆనంద్‌పూర్ సాహిబ్- శ్రీ కేస్‌ఘర్ సాహిబ్ గురుద్వారా
  • కిరాత్‌పూర్ సాహిబ్ – గురుద్వారా శ్రీ పాటల్‌పురి సాహిబ్
  • సిర్హింద్- శ్రీ ఫతేగర్ సాహిబ్
  • అమృత్సర్- శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్, శ్రీ హర్మందిర్ సాహిబ్ అమృత్సర్
  • బటిండా- శ్రీ దామ్‌దామా సాహిబ్
  • నాందేడ్- శ్రీ హజూర్ సాహిబ్
  • బీదర్- నానక్ ఝీరా బీదర్ సాహిబ్
  • పాట్నా- గురుద్వారా శ్రీ హర్మందిర్ సాహిబ్

రైలు ఛార్జీలో యాత్రికులకు మంచి హోటల్‌లో వసతి, ఆహారం, అల్పాహారం, స్టేషన్‌కు బయలుదేరేందుకు బస్సు సౌకర్యం ఉంటాయి. 2019లో రైల్వేలు సిక్కు సమాజానికి మతపరమైన ప్రాముఖ్యత కలిగిన యాత్రికుల కోసం పంచ్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపాయి. ఇటీవల భారతీయ రైల్వే తన భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలును శ్రీరామ్-జాంకీ యాత్రలో ఫ్లాగ్ చేసింది. భారతదేశంలోని అయోధ్య, నేపాల్‌లోని జనక్‌పూర్‌లోని రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ అయోధ్య నుంచి జనక్‌పూర్ పర్యటన ఉంది. టూరిస్ట్ రైలు రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది. టూర్ ప్యాకేజీలో అదనపు ఆకర్షణలుగా నందిగ్రామ్, సీతామర్హి, కాశీ మరియు ప్రయాగ్‌రాజ్ సందర్శన కూడా ఉన్నాయి.

Irctc Package

అత్యాధునిక పర్యాటక రైలులో రెండు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆధునిక వంటగది, కోచ్‌లలో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్, ఫుట్ మసాజర్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలులో రెండు రకాల కోచ్‌లు ఉన్నాయి. రైలులో ప్రతి కోచ్‌కు సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల మెరుగైన భద్రతా వంటి సదుపాయాలున్నాయి.

మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి: SCR PR No. 913 Eng – Guru Kripa Sikh Shrines

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి