Indian Railways: ట్రైన్ మిస్సయిందా.? అదే టికెట్‌తో వేరే రైలు ఎక్కోచ్చా.! ఇలా చేస్తే..

మీరు తరచుగా రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అనూహ్యంగా ఓ రోజు మీరు ట్రైన్ మిస్సయితే.. మరి ఆ టికెట్‌తో వేరే రైలులో ప్రయాణించవచ్చా.? అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.. ఇలా చేశారంటే కచ్చితంగా మీరు సేఫ్.! ఓ సారి చెక్ చేయండి.

Indian Railways: ట్రైన్ మిస్సయిందా.? అదే టికెట్‌తో వేరే రైలు ఎక్కోచ్చా.! ఇలా చేస్తే..

Updated on: Jan 07, 2026 | 7:29 AM

తరచుగా రైలు ప్రయాణం చేసేవాళ్లు.. అప్పుడప్పుడూ దాన్ని మిస్ అవుతుండటం సర్వసాధారణం. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా రైలు మిస్ అయితే..! మరి ఆ ట్రైన్‌కు తీసుకున్న టికెట్‌తో వేరే రైలులో ప్రయాణించవచ్చా.? లేదా డబ్బులు రీఫండ్ వస్తాయా.? లాంటి ప్రశ్నలు చాలానే వస్తుంటాయి. మరి ఇంతకీ రైలు నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు తాము వెళ్లే రైలును మిస్ చేసుకుంటే.. టికెట్ జారీ చేసిన సమయం నుంచి సుమారు మూడు గంటలు లేదా అందుబాటులో ఉన్న నెక్స్ట్ ట్రైన్ వరకు అది చెల్లుబాటు అవుతుంది. కేవలం జనరల్ టికెట్‌తో అన్-రిజర్వడ్ కేటగిరీలోనే ప్రయాణించవచ్చు. అలా కాదని ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, రాజధాని, శతాబ్ది, వందేభారత్ లాంటి ప్రీమియం రైళ్లలో జనరల్ టికెట్లు చెల్లవు. ఈ రైళ్లలో జనరల్ టికెట్‌తో ప్రయాణిస్తూ టీటీఈకి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సిందే. కొన్ని సందర్భాలలో పూర్తి టికెట్ ధరతో పాటు అదనపు ఫైన్ కూడా వసూలు చేసే అవకాశం ఉంటుంది.

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులు తమ రైలును మిస్ చేసుకుంటే.. అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించలేరు. ఒకవేళ ప్రయాణిస్తే టీటీఈ కచ్చితంగా ఫైన్ తీసుకుంటాడు. అలాగే మీ రైలు మిస్ అయితే.. కొన్ని రూల్స్‌కు అనుగుణంగా మీకు డబ్బులు రీఫండ్ అవుతాయి. మీరు ప్రయాణించలేని సమయంలో వీలైనంత త్వరగా టీడీఆర్ దాఖలు చేయాలి. అయితే డబ్బులు పూర్తిగా రీఫండ్ కావు. మీ రైలు మూడు గంటల కంటే ఎక్కువగా ఆలస్యంగా నడుస్తున్నా.. లేదా మీరు ప్రయాణాన్ని ప్రారంభించకపోతే పూర్తి డబ్బు వాపసు వస్తుంది. మరోవైపు మీరు మీ స్టేషన్‌లో రైలును మిస్ చేసినప్పటికీ, తదుపరి రెండు స్టేషన్ల వరకు మీ రిజర్వ్ చేసిన సీటును టీటీఈ ఇతరులకు కేటాయించలేడు. కాబట్టి ఏది ఏమైనా మిస్ అయిన స్టేషన్ దగ్గర నుంచి మరో రెండు స్టేషన్లలోపు రైలును అందుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి