AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: దుప్పట్ల శుభ్రత పై విమర్శల నేపథ్యంలో రైల్వే వివరణ..

ఇండియన్‌ రైల్వే కీలక ప్రకటన చేసింది. రైళ్లలో ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్న దుప్పట్ల శుభ్రతకు సంబంధించి ఇటీవల వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక ప్రకనట చేసింది. రైళ్లలో దుప్పట్లను ఉతికేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ అందుబాటులో ఉంది. లాంటి వివరాలను వెల్లడించింది..

Indian Railway: దుప్పట్ల శుభ్రత పై విమర్శల నేపథ్యంలో రైల్వే వివరణ..
Narender Vaitla
|

Updated on: Nov 30, 2024 | 8:00 PM

Share

రైళ్లలో ఉపయోగించే దుప్పట్ల పరిశుభ్రతకు సంబంధించి చర్చ నడుస్తోన్న నేపథ్యంలో భారతీయ రైల్వే ఓ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకుల సౌకర్యాలు, సదుపాయాలను అత్యంత పరిశుభ్రతతో అందించడానికి భారతీయ రైల్వే ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపింది. బెడ్ రోల్స్ సరఫరాలో ఎలాంటి రాజీ పడకుండా ఒక క్రమపద్ధతిలో శుభ్రమైన, ఆరోగ్యకరమైన లెనిన్, ఉన్ని దుప్పట్ల సరఫరా జరుగుతోంది. బెడ్ రోల్‌లోని పాకెట్లో 2 వైట్ బెడ్ షీట్‌లు, ఒక పిల్లో కవర్, ఫేస్ టవల్‌తో పాటు ఉన్ని దుప్పటి అందిస్తారని తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజూ ప్రత్యేక రైళ్లతో సహా 116 రైళ్లలోని అన్ని ఏసీ కోచ్‌లలో శుభ్రమైన బెడ్‌రోల్స్‌ సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా సగటున ప్రతిరోజూ 38,000 ఉన్ని దుప్పట్లు, 1,52,000 బెడ్ రోల్స్ ప్రయాణికులకు సరఫరా చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఈ బెడ్‌రోల్స్‌ ను శుభ్రపరిచడానికి, సరఫరా చేయడానికి ఔట్‌సోర్సింగ్‌తో సహా 7 ప్రదేశాలలో మెకనైజ్డ్ లాండ్రీలను ఏర్పాటు చేసింది. తెల్లటి బెడ్‌షీట్‌ ఒక్కసారి ఉపయోగించిన వెంటనే ఉతుకుతారు.

2010లో ఉన్ని దుప్పట్లను శుభ్రపరచాలని ఉన్న 3 నెలల కాల వ్యవధిని 2 నెలలకు తగ్గించారు. ఇంకా, సామర్థ్య పరిమితులను దృష్టిలో ఉంచుకుని దుప్పట్లను నెలకు రెండుసార్లు ఉతకాలని, నెలకు ఒకసారి కనీసం శుభ్రం చేయాలని నిర్ణయించారు. నెలవారీ వాషింగ్ ఫ్రీక్వెన్సీతో ఇప్పటికే ఉన్న దుప్పట్ల లైఫ్‌ టైమ్‌ను 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గిచ్చారు. బెడ్ రోల్‌ను ఉతకడానికి అధునాతన మిషిన్స్‌ను ఉపయోగిస్తున్నట్లు ఇండియన్‌ రైల్వే తెలిపింది. శుభ్రం చేసిన బెడ్‌ రోల్‌ నాణ్యతను చెక్‌ చేసేందుకు వైట్‌ మీటర్లను ఉపయోగించారు. లినెన్/బెడ్‌రోల్‌పై ఫిర్యాదులతో సహా రైల్ మదద్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులపై పర్యవేక్షణ/సత్వర చర్యను పర్యవేక్షించడానికి జోనల్ హెడ్-క్వార్టర్స్, డివిజనల్ స్థాయిలలో వార్-రూమ్‌లు ఏర్పాటు చేశారు.

స్టేషన్స్‌తో పాటు, రైళ్లలో బెడ్‌రోల్‌లను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి, లోడ్ చేయడానికి అలాగే అన్‌లోడ్ చేయడానికి మెరుగైన లాజిస్టిక్స్ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దుప్పట్లను ఉతికేందుకు సికింద్రాబాద్‌లో రోజుకు 2 టన్నుల సామర్థ్యంతో కూడిన లాండ్రీ ఉంది. అలాగే తిరుపతిలో 2.5 టన్నుల కెపాసిటీ లాండ్రీ, కాకినాడలో 4 టన్నుల సామర్థ్యం, విజయవాడలో 1.5 టన్నుల సామర్థ్యం, నాందేడ్‌లో 1.5 టన్నుల కెపాసిటీ, కాచిగూడలో ఏకంగా 12 టన్నుల కెపాసిటీతో కూడిన లాండ్రీలను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో సికింద్రాబాద్‌, కాచిగూడలో 48 టన్నుల కెపాసిటీ లాండ్రీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, గుంటూరులో 10 టన్నుల కెపాసిటీ లాండ్రీని ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..