Indian Railways: రాత్రిపూట రైలులో ప్రయాణిస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే చిక్కుల్లో పడతారు..

మీరు రాత్రిపూట రైలులో ప్రయాణిస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. లేకపోతే మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త రైల్వే రూల్స్ ఏంటి? అలాగే మీ లగేజీ, డాక్యుమెంట్లు భద్రంగా ఉండాలంటే ఎలాంటి లాక్‌లు ఉపయోగించాలి అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Indian Railways: రాత్రిపూట రైలులో ప్రయాణిస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే చిక్కుల్లో పడతారు..
Indian Railways Night Travel Rules

Updated on: Oct 17, 2025 | 10:34 PM

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, రైల్లు ఎప్పటికప్పుడు మార్పులు, కొత్త కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలకు ప్రశాంతమైన నిద్రను అందించేలా రైల్వే నిబంధనలను కఠినతరం చేసింది. మీరు రాత్రిపూట రైలులో ప్రయాణిస్తుంటే, పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు.. అలాగే మీ వస్తువులను సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని భద్రతా చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.

రాత్రి ప్రయాణాలకు రైల్వే నియమాలు

ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండటానికి రాత్రి 10 గంటల తర్వాత ఈ నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

సౌండ్ నిషేధం: స్పీకర్లలో బిగ్గరగా మ్యూజిక్ ప్లే చేయడం పూర్తిగా నిషేధించబడింది. రాత్రిపూట పాటలు వినాలనుకుంటే ప్రయాణీకులు తప్పనిసరిగా ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించాలి.

ఫోన్ మాట్లాడడం: మీ సీటులో, కంపార్ట్‌మెంట్‌లో లేదా కోచ్‌లో బిగ్గరగా ఫోన్‌లో మాట్లాడటం కుదరదు.

లైట్ల నియంత్రణ: రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన లైట్లు వేయకూడదు. అయితే ప్రయాణీకులు తమ బెర్త్‌ల దగ్గర ఉండే నైట్ లైట్లు లేదా రీడింగ్ లైట్లను ఉపయోగించుకోవచ్చు. రాత్రిపూట ఈ నియమాలను పాటించని ప్రయాణీకులపై అధికారులు జరిమానాతో సహా తగిన చర్యలు తీసుకునే అధికారం ఉంది.

భద్రత కోసం ముఖ్యమైన చిట్కాలు

రాత్రి ప్రయాణాలలో మీ వస్తువులను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి

లాక్ బ్యాగులు: మీ వస్తువులను సురక్షితంగా ఉంచడానికి లాక్ చేయగల లేదా జిప్‌లు ఉన్న బ్యాగులను ఉపయోగించండి. వాటిని మీ బెర్త్ కింద చైన్‌తో కట్టడం ఉత్తమం.

ముఖ్యమైన డాక్యుమెంట్లు: మీరు ఇంటర్వ్యూ లేదా ముఖ్యమైన పని కోసం వెళుతుంటే.. మీ డాక్యుమెంట్, నగదు వంటి విలువైన వస్తువులను మీ దగ్గరే ఉంచుకోండి. వాటిని లగేజీలో ఉంచవద్దు.

పవర్ బ్యాంక్: మీ ఫోన్ ఛార్జ్ అయిపోవచ్చు కాబట్టి పవర్ బ్యాంక్‌ను అందుబాటులో ఉంచుకోండి. మీ సీటు దగ్గర పవర్ ప్లగ్స్ లేకపోతే మీ ఫోన్‌ను దూరంగా ఛార్జ్ చేయడం ప్రమాదకరం.

సుదూర రైలు ప్రయాణాలకు, టికెట్‌ను ముందుగానే బుకింగ్ చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది, ఎందుకంటే చివరి నిమిషంలో టికెట్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..