Indian Railways: రద్దు చేసిన టిక్కెట్ల ద్వారా రైల్వే ఎన్ని వేల కోట్లు సంపాదించిందో తెలుసా?

రైల్వే వెయిటింగ్ లిస్ట్‌లోని చాలా టిక్కెట్లు రద్దు అవుతుంటాయి. దీని ద్వారా భారతీయ రైల్వేకు భారీ ఆదాయం వస్తుంది. సమాచార హక్కు చట్టం లేదా RTI చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. రద్దు చేసిన టిక్కెట్లు రైల్వేకు గణనీయమైన ఆదాయ వనరుగా మారాయని రైల్వే స్వయంగా చెప్పింది. డేటా ప్రకారం, 2021- 2024 మధ్య వెయిటింగ్ లిస్ట్‌లో రద్దు..

Indian Railways: రద్దు చేసిన టిక్కెట్ల ద్వారా రైల్వే ఎన్ని వేల కోట్లు సంపాదించిందో తెలుసా?
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2024 | 8:41 AM

రైల్వే వెయిటింగ్ లిస్ట్‌లోని చాలా టిక్కెట్లు రద్దు అవుతుంటాయి. దీని ద్వారా భారతీయ రైల్వేకు భారీ ఆదాయం వస్తుంది. సమాచార హక్కు చట్టం లేదా RTI చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. రద్దు చేసిన టిక్కెట్లు రైల్వేకు గణనీయమైన ఆదాయ వనరుగా మారాయని రైల్వే స్వయంగా చెప్పింది. డేటా ప్రకారం, 2021- 2024 మధ్య వెయిటింగ్ లిస్ట్‌లో రద్దు చేసిన టిక్కెట్ల ద్వారా రైల్వే రూ.1,229 కోట్లు ఆర్జించింది. దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త వివేక్ పాండే రైతులను వివరాలు అడుగగా, దానికి స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని పంచుకుంది. రద్దు చేసిన టిక్కెట్ల ఆదాయం పెరిగిందని రైల్వేలు పంచుకున్న డేటా తెలియజేస్తోంది.

రద్దు చేసిన టిక్కెట్ల నుండి రాబడి

ఆర్టీఐ ప్రత్యుత్తరాల ప్రకారం, 2021లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మొత్తం 2.53 కోట్ల టిక్కెట్లు రద్దు అయ్యాయి. దీని ద్వారా రైల్వే ఆదాయం 242.68 కోట్లు. 2022లో 4.6 కోట్ల టిక్కెట్లు రద్దు కాగా, అందుకే రూ.439 కోట్ల ఆదాయం పెరిగింది. అదేవిధంగా 2023లో మొత్తం 5.36 కోట్ల రైల్వే టిక్కెట్లు రద్దు అయ్యాయి. రైల్వే ఆదాయం రూ.505 కోట్లు. ఇక 2024లో ఒక్క జనవరిలోనే 45.86 లక్షల టిక్కెట్లు రద్దు కాగా, 43 కోట్ల ఆదాయం వచ్చింది.

2023 దీపావళి సందర్భంలో..

ఇవి కూడా చదవండి

గత మూడేళ్లలో 2023 దీపావళి సందర్భంగా అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు రద్దు అయ్యాయి. నవంబర్ 5 – నవంబర్ 17, 2023 మధ్య 96.18 లక్షల టిక్కెట్లు రద్దు అయ్యాయి. ఈ రద్దు చేసిన టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు మాత్రమే కాదు, కన్ఫర్మ్ టిక్కెట్లు, ఆర్‌ఏసీ టిక్కెట్లు కూడా. ఫలితంగా ఆ 12 రోజుల్లో రద్దు చేసిన టిక్కెట్ల ద్వారా రైల్వే మొత్తం రూ.10.37 కోట్లను ఆర్జించింది.

మీరు టికెట్ రద్దు చేస్తే, రైల్వే ఎంత ఖర్చు చేస్తుంది?

వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే –

RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ రద్దు చేస్తే ఒక్కో ప్రయాణికుడికి రూ.60 తగ్గించి ఇస్తుంది.

48 గంటల ముందు రద్దు చేస్తే: రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు ధృవీకరించిన టిక్కెట్‌ను రద్దు చేస్తే రైల్వే రద్దు రుసుమును వసూలు చేస్తుంది. ఈ కింది విధంగా వివిధ తరగతుల టిక్కెట్ల రద్దు ఛార్జీలు ఉన్నాయి.

  • AC ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.240
  • AC 2 టైర్ లేదా ఫస్ట్ క్లాస్ – రూ.200
  • AC 3 టైర్ లేదా AC చైర్ కార్ లేదా AC 3 ఎకానమీ క్లాస్ – రూ.180
  • స్లీపర్ క్లాస్ – రూ.120
  • రెండవ తరగతి – రూ.60

48 గంటల కంటే తక్కువ ఉంటే

రైలు బయలుదేరడానికి 12 గంటల నుండి 48 గంటల ముందు కన్ఫర్మ్‌ అయిన టిక్కెట్‌ను రద్దు చేసినట్లయితే అసలు ఛార్జీలో 25 శాతం రద్దు రుసుముగా తీసివేస్తుంది రైల్వే. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు చార్ట్ తయారు చేస్తారు. రైలు బయలుదేరే 4 గంటల నుంచి 12 గంటల మధ్య టిక్కెట్‌ను రద్దు చేసినట్లయితే, టికెట్ రద్దు రుసుములో 50 శాతం వరకు కట్‌ చేస్తుంది రైల్వే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి