Indian Railway: దేశంలో మరో కొత్త రైలు పరుగులు.. సౌండ్‌ లేదు, పొగరాదు.. టికెట్‌ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

ఎలాంటి శబ్దం ఉండదు. ఏ మాత్రం పొగ రాదు..ఈ నెల నుండి భారతదేశంలో ఒక కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఇది వేగంలో వందే భారత్ రైళ్లతో పోటీ పడనుంది. లక్షణాలలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు ధీటుగా నిలుస్తుంది. కానీ, ఛార్జీల పరంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అతి పొడవైన వాయుశక్తితో నడిచే రైలు భారతదేశంలో నడుస్తుంది. దాని మార్గం, వేగం, స్టాప్‌ల వివరాలేంటో పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం...

Indian Railway: దేశంలో మరో కొత్త రైలు పరుగులు.. సౌండ్‌ లేదు, పొగరాదు.. టికెట్‌ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!
Hydrogen Train

Updated on: Jan 11, 2026 | 9:32 PM

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు 2026 జనవరి 26న సర్వీసును ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ట్రయల్ రన్‌లు పూర్తయ్యాయి. విమాన ప్రయాణాన్ని పోలిన అనుభవాన్ని అందించే ఈ సైలెంట్‌ ట్రైన్‌ త్వరలో జింద్-సోనిపట్ రూట్‌లో నడుస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేయబడిన ఈ హైడ్రోజన్ రైలు 356 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తుంది. దీని సేవను క్రమంగా విస్తరించనున్నారు.

ఒకేసారి 2,600 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లగల ఈ రైలు రెండు ట్రిప్పులు నడుస్తుంది. దీని వేగం గంటకు 150 కి.మీ.కు చేరుకుంటుంది. ఈ రైలు భారతదేశంలో నడుస్తున్న ప్రపంచంలోనే అతి పొడవైన హైడ్రోజన్ రైలు అవుతుంది. ప్రతి కిలోగ్రాము హైడ్రోజన్ 2 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తుంది.

ఈ రైలు స్పెషాలిటీ ఏంటంటే..

ఇవి కూడా చదవండి

హైడ్రోజన్ రైలు కోచ్‌లలో ఉష్ణోగ్రత సెన్సార్లు, ఆధునిక టాయిలెట్లు, వాష్‌బేసిన్‌లు అమర్చబడి ఉంటాయి. సౌకర్యవంతమైన నీలిరంగు పరుపులు, ఆధునిక సీలింగ్ ఫ్యాన్లు, LED లైట్ ప్యానెల్‌లు ఏర్పాటు చేశారు. మెట్రో మాదిరిగానే రైలులో స్లైడింగ్ డోర్లు, ఆధునిక బయో-టాయిలెట్లు ఉన్నాయి. రైలు నేవీ బ్లూ, వైట్ రంగులలో అలంకరించబడింది. ఇకపోతే, ఈ హైడ్రోజన్ రైలు మొదట్లో సోనిపట్, జింద్ మధ్య నడుస్తుంది. ఈ రైలు వేగం గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. కనీస ఛార్జీ రూ. 5 గరిష్ట ఛార్జీ రూ. 25 ఉంటుందని అంచనా. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఏ ఏ రూట్లలో నడుస్తుంది..?

దేశంలోనే అతి పొడవైన హైడ్రోజన్ రైలు మార్గం జింద్- సోనిపట్ మధ్య ఉంటుంది. దీనిలో మార్గంలో నాలుగు నుండి ఐదు స్టాప్‌లు ఉంటాయి. ఈ హైడ్రోజన్ రైలు డీజిల్ లేదా విద్యుత్తుతో నడవదు. ఇది నీటితో నడిచే రైలు. నీటిని హైడ్రోజన్ వాయువు, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తితో నడుస్తుంది. ఈ ప్రక్రియ ఎటువంటి కాలుష్యాన్ని ఉత్పత్తి చేయదు. ఇది పూర్తిగా కాలుష్య రహితంగా పనిచేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి