Budget 2023: హైదరాబాద్ కేంద్రంగా ‘శ్రీఅన్న’ పరిశోధనలు.. త్వరలో మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు..!
‘శ్రీఅన్న’ పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు చేపట్టడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. త్వరలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేస్తామని
‘శ్రీఅన్న’ పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు చేపట్టడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. త్వరలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారతదేశం @ 100 ద్వారా దేశం ప్రపంచవ్యాప్తంగా బలోపేతం అవుతుంది. పీఎం మత్స్య సంపద యోజన కోసం అదనంగా రూ.6వేల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.20లక్షల కోట్ల వరకూ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులను పంచాయతీ స్థాయిలో నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారామె.
ఆర్థిక మంత్రి ఇంకా ఏమన్నారంటే..
గ్రామీణ మహిళల కోసం 81 లక్షల స్వయం సహాయక సంఘాలకు సహాయం లభించింది. ఇక ముందు ఇది మరింత పెరుగుతుంది. క్రాఫ్ట్, ట్రేడ్‌లో పనిచేస్తున్నవారికి, కళ, హస్తకళలకు సహకరించేందుకు పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ తీసుకొస్తున్నాం. స్వావలంబన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీని ద్వారా ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి వారికి సామాజిక భద్రత కల్పించారు.
అణగారిన వర్గాలకు ప్రాధాన్యత..
ఈ బడ్జెట్‌లో 7 ప్రాధాన్యతలు ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌తో అగ్రి స్టార్టప్‌లు వృద్ధి చెందుతాయి. ఇది రైతులకు సహాయం చేస్తుంది. వారు సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. ఇది ఉత్పాదకతను పెంచుతుంది. ఇది రైతులు, రాష్ట్రం, పరిశ్రమ భాగస్వామి మధ్య జరుగుతుంది. అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ ప్రాధాన్యత.
విశ్వకర్మలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు..
మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహిస్తాం. శతాబ్దాల తరబడి తమ స్వహస్తాలతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారిని విశ్వకర్మ అనే పేరుతో సంబోధిస్తున్నారు. తొలిసారిగా వారికి సహాయ ప్యాకేజీని నిర్ణయించారు. వాటిని MSME చైన్‌తో అనుసంధానించే పని జరుగుతుందన్నారు. క్రాఫ్ట్, ట్రేడ్‌లో పనిచేస్తున్నవారికి పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ కింద నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
Indian Institute of Millet Research will be supported as a centre of excellence: FM Nirmala Sitharaman in Parliament
— ANI (@ANI) February 1, 2023
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..