
తరాలుగా పేర్చుకుంటూ వస్తున్న బతుకమ్మ.. ఇప్పుడు తెలంగాణ బిగ్గెస్ట్ కార్నివాల్‌గా మారింది. ఏకంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇంద్రకీలాద్రిపై దసరా సందడంటే.. భక్తులు, భవానీలు, మాలవిరమణలే. ఈసారి అంతకు మించి అనేలా దసరా ఉత్సవ్ సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో ఓ కామన్ పాయింట్ ఏంటంటే… లోకల్ ఫెస్టివల్‌ను గ్లోబల్ వర్షన్‌లోకి తీసుకెళ్తుండడం. టెంపుల్ టూరిజం కోసం కమర్షియల్ ఈవెంట్స్ జరపడం. దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడం. పైకి కనిపించట్లేదు గానీ అదొక రాజకీయ వ్యూహం కూడా. సపోజ్.. బతుకమ్మ. ప్రజలకు దగ్గరవడానికి ఆ వేడుక ఓ వేదిక. పొలిటికల్ మైలేజ్ పెంచుకోడానికి అదో అవకాశం. సేమ్ టు సేమ్.. బెజవాడ దసరా ఉత్సవ్. సంబరాలతో పాటు రాజకీయ వివాదాలకూ వేదికైందా వేడుక. ఇదంతా చూస్తుంటే బెంగాల్ పాలిటిక్స్ గుర్తొస్తాయి. కలకత్తా కాళికి ఉన్న బ్రాండ్ ఇమేజ్.. ఆ రాష్ట్ర GDPకి ఆయువుపట్టు. పైగా భక్తి పేరుతో ఫుల్ సెంటిమెంట్. అందుకే, ఈ నవరాత్రులను రాజకీయానికీ వాడుకుంటాయి అక్కడి పార్టీలు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. భక్తి ప్లస్ వ్యాపారం ప్లస్ రాజకీయం. ఈ కాంబో నడుస్తోంది. ఈ నయా పోకడతో వచ్చే పొలిటికల్ మైలేజ్ ఎంత? రాష్ట్రాలకు జరిగే లాభమెంత? పండగల్లో పాలిటిక్స్ తీసుకొస్తున్న మార్పును జనం ఎలా చూస్తున్నారు? కంప్లీట్ డిటైల్స్ ఇవాళ్టి బర్నింగ్ టాపిక్‌లో. ఆలయాలకు రండి అని భక్తులకు చెప్పక్కర్లేదు. ప్రభుత్వాలు పెద్దగా ప్రచారం...