Salary Hike: వచ్చే ఏడాది జీతాలు పెరుగుతాయా? లేటెస్ట్ సర్వే ఏం చెప్పిందంటే..

వచ్చే ఏడాది మన దేశంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ రానుందా? జీతం బాగా పెరగనుందా? అంటే అంత అవకాశం లేదనే మాటే వినిపిస్తోంది. ఇటీవల చేసిన ఓ సర్వేలో మీడియన్ ఇంక్రిమెంట్ 2025కు గానూ 9.5శాతం ఉండే అవకాశం ఉందని తేల్చింది. అయితే మిగిలిన దేశాల మార్కెట్లతో పోల్చితే మన దేశంలోనే ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చే చాన్స్ ఉందని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Salary Hike: వచ్చే ఏడాది జీతాలు పెరుగుతాయా? లేటెస్ట్ సర్వే ఏం చెప్పిందంటే..
Salary Hike
Follow us
Madhu

|

Updated on: Oct 16, 2024 | 1:51 PM

ఏ సంస్థలో పనిచేసే ఉద్యోగి అయిన ఏడాదంతా కష్టపడి పనిచేస్తూనే కంపెనీ నుంచి తనకు ప్రోత్సాహం కావాలను కోరుకుంటాడు. దానిలో ప్రధానంగా ఏటా ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఆశిస్తాడు. అది కూడా తన కష్టానికి ప్రతిఫలంగా సంతృప్తస్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. తీరా సమయం వచ్చే సరికి ఆశించిన స్థాయిలో హైక్ పొందకపోతే ఉద్యోగుల్లో నిరాసక్తత ఆవరిస్తుంది. ఈ ఏడాది అదే పరిస్థితి అదే పరిస్థితి ఏర్పడింది. అనేక అనిశ్చిత పరిస్థితుల కారణంగా శాలరీ హైక్ 9.5శాతం లోపే వచ్చింది. వచ్చే ఏడాది అంటే 2025లో కూడా అంతే స్థాయిలో సంస్థలు తమ ఉద్యోగులకు శాలరీ ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశం ఉందని అడ్వైజరీ, బ్రోకింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ అయితన డబ్ల్యూటీడబ్ల్యూ ఇచ్చిన లేటెస్ట్ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్టు స్పష్టం చేసింది. ఇది 2024లో చూసిన వాస్తవ శాలరీ హైక్ కు అనుగుణంగానే ఉంది. మంగళవారం ఆ సంస్థ ఈ సర్వే రిపోర్టును విడుదల చేసింది. అయితే ఇది మిగిలిన దేశాలతో పోల్చితే ఎక్కువగానే ఉంది.

మిగిలిన దేశాలలో ఇలా..

2025లో మన దేశంలో మీడియన్(మధ్యస్థ) జీతం 9.5 శాతం పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ఇది అంతకుముందు సంవత్సరంలో చూసిన 9.5 శాతం పెరుగుదలకు సమానంగా ఉంది. అదే సమయంలో మిగిలిన దేశాల మార్కెట్లో పోల్చితే మన వద్దే అధికంగా ఉంది. వియత్నాం 7.6 శాతం, ఇండోనేషియా 6.5 శాతం, ఫిలిప్పీన్స్ 5.6 శాతం, చైనా 5 శాతం, థాయ్‌లాండ్ 5 శాతం జీతం పెంపు చేసే అవకాశం ఉంది. అంటే రాబోయే రాబోయే సంవత్సరంలో మన దేశంలో జీతం పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది.

ఏ ఏడాది ఎంత?

మన దేశంలో ఏ సంవత్సరం ఎంత జీతం పెరుగుదలను చూసిందనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే.. 2021లో అంచనా 7శాతం ఉండగా.. వాస్తవ జీతం పెరుగుదల 8.5శాతంగ ఉంది. 2022లో అంచనా పెరుగుదల 9.3శాతం కాగా.. వాస్తవ పెరుగుదల 9.8శాతం, 2023లో అంచనా జీతం పెరుగుదల 9.8శాతం కాగా.. వాస్తవ పెరుగుదల 10శాతం, 2024లో అంచనా పెరుగుదల 9.8శాతం కాగా, వాస్తవ పెరుగుదల 9.5శాతంగా ఉంది. వచ్చే ఏడాది అంటే 2025 అంచనా పెరుగుదల 9.5శాతంగా సర్వే సంస్థ పేర్కొంది. మరి వాస్తవ పెరుగుదల ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఏ పరిశ్రమలో ఎంత వృద్ధి..

సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక వివిధ పరిశ్రమ రంగాల్లోని ఉద్యోగ గ్రేడ్‌ల శ్రేణిని విశ్లేషించింది. తద్వారా జీతం పెరుగుదలను అంచనా వేసింది. 2025 అంచనాల ప్రకారం, వివిధ పరిశ్రమలలో జీతాల పెరుగుదల సాధారణ పరిశ్రమ సగటు 9.5 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. దానిలో ఫార్మాస్యూటికల్స్ (+10 శాతం), తయారీ (+9.9 శాతం), బీమా (+9.7 శాతం), క్యాప్టివ్‌లు, ఎస్ఎస్ఓ సెక్టార్‌లు (+9.7 శాతం), రిటైల్ (+9.6 శాతం) వంటి రంగాలు అనుభవంలోకి వస్తాయి. పరిశ్రమ సగటు కంటే జీతం పెరుగుతుంది. మరోవైపు సాఫ్ట్‌వేర్, బిజినెస్ సర్వీసెస్‌ రంగాల్లో మధ్యస్థం కంటే 9 శాతం జీతం పెరుగుతుందని అంచనా వేసింది.

ఆశలు ఎక్కువే..

వాస్తవానికి భారత్‌లోని కంపెనీలు వృద్ధిపై ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వారు దానిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ‘గ్రేట్ రిజిగ్రేషన్’ అందరి మైండ్ ఉంది. దీంతో యజమానులు, ఉద్యోగులు ఇద్దరూ ఇప్పుడు స్థిరత్వాన్ని కోరుతున్నారని సర్వే సంస్థ పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే