Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వ అందిస్తోన్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి పథకంపై ప్రజల్లో ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ తీసుకొచ్చిన ఈ పథకంపై భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన గణాంకాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. గత ఏడాది కాలంలో ఈ పథకాన్ని తీసుకున్న వారి సంఖ్య ఏకంగా 40 శాతానికి పెరగడం విశేషం. 2020 మే చివరి నాటికి ఈ పథకంలో రూ. 75,522 కోట్ల పెట్టుబడి ఉండగా.. ఈ ఏడాది మే నాటికి ఈ మొత్తం రూ. 1.05 లక్షల కోట్లకు చేరుకుంది. నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించిన గణంకాలు సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు సాక్ష్యంగా నిలుస్తోంది.
ఇక ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే.. కేవలం ఆడ పిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. దీనిలో చేరిన వారు అమ్మాయి పేరుపై ప్రతి నెల కొంత డబ్బు డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ది స్కీమ్‌లో చేరడం వల్ల అమ్మాయిలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఏడాదిలో కనీసం రూ.250 కూడా చేయవచ్చు. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిటిట్ చేయవచ్చు. అకౌంట్‌లో ఎంత డబ్బు జమ చేయాలనేది మీ ఇష్టం. పదేళ్లలోపు ఆడ పిల్లల పేరుపై మాత్రమే ఈ పథకంపై అకౌంట్‌ను తెరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. పోస్టాఫీసు లేదా బ్యాంక్‌కు వెళ్లి మీరు సుకన్య సమృద్ది అకౌంట్ తెరుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకం ఇన్వెస్ట్ చేసే డబ్బులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.
Also Read: Ariyana Glory : పిట్ట కొంచం.. కూతఘనం.. అందం అమోఘం.. అరియనా డాన్స్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే..
దొంగతనానికి వచ్చిన దొంగ.. లోపలికి వెళ్లేందుకు అవకాశం లేక.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు.!
Honda Cars Price: హోండా కంపెనీ కారు కొనాలనుకుంటున్నారా.? అయితే వెంటనే ఆ పని చేయండి. ఆలస్యం చేస్తే…