FDI Investments: ఎఫ్‌డిఐ పెట్టుబడులు ఆకర్షించటంలో టాప్-10లో భారత్.. వందకుపైగా ఒప్పందాలు..
FDI Investments: 2021లో భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 19 బిలియన్ డాలర్లు తగ్గి.. 45 బిలియన్ డాలర్లకు చేరాయని ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. అయినప్పటికీ..
FDI Investments: 2021లో భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 19 బిలియన్ డాలర్లు తగ్గి.. 45 బిలియన్ డాలర్లకు చేరాయని ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. అయినప్పటికీ.. ఎఫ్‌డిఐ పరంగా దేశం టాప్-10 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కొనసాగుతోంది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ ఎఫ్‌డిఐ గత సంవత్సరం ప్రీ-పాండమిక్ స్థాయిలకు మెరుగుపడింది. ఇది దాదాపు 1,600 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే.. ఈ ఏడాది ఎఫ్‌డిఐపై అవకాశాలు బాగా లేవు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధనం, ఆహార ధరలు.. పెట్టుబడిదారుల అనిశ్చితి కారణంగా ఏర్పడిన సంక్షోభం కారణంగా.. 2022లో అంతకు మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రభావితమవుతున్నాయి.
2020లో భారతదేశం 64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందింది. ఇది 2021లో 45 బిలియన్ డాలర్లు తగ్గింది. అయినప్పటికీ, ఎఫ్‌డిఐ పరంగా భారత్ 10 ప్రధాన దేశాల్లో ఒకటి. అమెరికా, చైనా, హాంకాంగ్, సింగపూర్, కెనడా, బ్రెజిల్ తర్వాత భారత్ ఏడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, రష్యా, మెక్సికో కూడా ఎఫ్‌డిఐని పొందడంలో టాప్-10 దేశాల్లో ఉన్నాయి. కొత్త అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఫైనాన్స్‌పై అనేక ఒప్పందాలు జరిగాయి. దీని కింద.. 108 ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయి.
భారత్ లో స్టీల్, సిమెంట్ ఫ్యాక్టరీని 13.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయడం, కొత్త కార్ల తయారీ కర్మాగారాన్ని నిర్మించడానికి సుజుకి మోటార్ 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయి. దక్షిణాసియా, ప్రధానంగా భారత్ నుంచి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 43 శాతం పెరిగి 16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాల్లో ఆర్థిక వృద్ధి, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGలు) వైపు అంతర్జాతీయ పెట్టుబడి పరంగా చాలా విస్తృతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితి ఏర్పడింది.