Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్.. 139 టన్నుల బంగారం విక్రయాలు

|

Oct 29, 2021 | 11:02 AM

భారత మగువలకు బంగారంపైనున్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు పెట్టుబడిదారులు కూడా బంగారాన్ని మించిన సురక్షితమైన పెట్టుబడి మరొకటి లేదని భావిస్తారు.

Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్.. 139 టన్నుల బంగారం విక్రయాలు
Gold
Follow us on

India’s Gold Demand: భారత మగువలకు బంగారంపైనున్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు పెట్టుబడిదారులు కూడా బంగారాన్ని మించిన సురక్షితమైన పెట్టుబడి మరొకటి లేదని భావిస్తారు. అందుకే వారు దేశంలో కరోనా ప్రభావం తగ్గుతున్న వేళ భారీగా బంగారు ఆభరణాలు, కాయిన్స్ కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారంకు డిమాండ్‌ తగ్గినా.. భారత్‌లో మాత్రం డిమాండ్ పెరగడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసం(జులై, ఆగస్టు, సెప్టెంబర్)లో దేశంలో బంగారం డిమాండ్ అంచనాలను మించి 47 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌లో ఏకంగా 139 టన్నుల బంగారం కొనుగొలు చేశారు.

ఇదే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మాత్రం బంగారానికి డిమాండ్ 7 శాతం మేర తగ్గడం విశేషం. కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టడంతో భారత్‌లో బంగారం కొనుగోలు జోరందుకున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WGC) తన నివేదికలో వెల్లడించింది. కోవిడ్ సంక్షోభానికి మునుపటి స్థాయికి దేశంలో బంగారం డిమాండ్ చేరినట్లు తెలిపింది.

Gold

భారత్‌లో బంగారు ఆభరణాల డిమాండ్ 58 శాతం (96 టన్నుల) పెరిగినట్లు డబ్ల్యూజీసీ రీజనల్ సీఈవో(ఇండియా) పీఆర్ సోమసుందరం తెలిపారు. అలాగే గోల్డ్ బార్స్, కాయిన్స్‌లో పెట్టుబడి డిమాండ్ 18 శాతం పెరిగినట్లు వివరించారు. వర్షాలు సంతృప్తికరమైన స్థాయిలో లేకపోవడంతో పసిడి బార్లు, కాయిన్స్‌పై పెట్టుబడిలో వృద్ధిరేటు తగ్గినట్లు వివరించారు.

విలువ పరంగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసంలో బంగారం డిమాండ్ 37 శాతం (రూ.59,330 కోట్లు) పెరిగింది. మునుపటి సంవత్సరం ఇదే కాలంలో విలువపరంగా బంగారం డిమాండ్ వృద్ధి రూ.43,160 కోట్లుగా ఉంది.

Also Read..

Covaxin: అక్కడకు వెళ్లే భారతీయులకు శుభవార్త..కొవాగ్జిన్‌కు ఆమోదం..ఆంక్షల తొలగింపు..

Viral News: కోపం వస్తే అంతకు తెగించాలా.. మహిళపై మండిపడుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..