Viral News: కోపం వస్తే అంతకు తెగించాలా.. మహిళపై మండిపడుతున్న నెటిజన్లు.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
సాధారణంగా కోపం వస్తే గట్టిగా అరుస్తుంటారు.. మరీ కట్టలు తెంచుకునే కోపం వస్తే చేతిలో ఉన్న..
సాధారణంగా కోపం వస్తే గట్టిగా అరుస్తుంటారు.. మరీ కట్టలు తెంచుకునే కోపం వస్తే చేతిలో ఉన్న వస్తువులను ఎదుటివారిపై విసురుతుంటారు. కొందరైతే ఇలాంటి విషయాల్లో మౌనమే మంచిదని నిశ్శబ్ధంగా పక్కకు తప్పుకుంటుంటారు. అయితే బ్యాంకాక్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన అడ్డూ అదుపులేని ఆవేశంతో ఏకంగా జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె తన కోపాన్ని నియంత్రించుకోలేక ఇద్దరికి బతికుండగానే చావును దగ్గరగా చూపించింది. వారిని ఏకంగా 26వ అంతస్తు నుంచి గాల్లో వేలాడేలా చేసింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. మరి ఆమెకు అంతలా కోపం రావడానికి కారణమేంటో, గాల్లో వేలాడిన ఆ ఇద్దరి పరిస్థితేంటో తెలుసుకుందాం రండి.
గాల్లో వేలాడిన పెయింటర్లు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర బ్యాంకాక్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో కొన్ని సమస్యలు తలెత్తడంతో ఇద్దరు పెయింటర్లు తాడు సహాయంతో 26వ అంతస్తుకు వెళ్లి మరమ్మతులు చేయడం ప్రారంభించారు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ఓ మహిళ తనను అడగకుండా ఎలా మరమ్మతులు చేస్తారని కోపోద్రిక్తురాలైంది. పెయింటర్లు ఏర్పాటు చేసుకున్న తాడును కత్తిరించింది. అంతే ఆశ్చర్యపోయిన పెయింటర్లు 26వ అంతస్తు నుంచి కొద్ది సేపు గాల్లోనే వేలాడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తమ సహాయక సిబ్బందితో వచ్చి ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా కిందికి దింపారు. అదేవిధంగా తాడును కట్ చేసిన మహిళపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తనను పెయింటర్లను చంపాలనుకోలేదని…తన అనుమతి లేకుండా బిల్డింగ్ ఎక్కినందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చినప్పటికీ ఆ మహిళ చెప్పినా పోలీసులు వినలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘తన కోపమే తన శత్రువు’ అన్న సామెత మరోసారి నిజమైందని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: