ప్రపంచ దేశాలలో భారత్ సత్సంబంధాలు పెరుగుతున్న వేళ వ్యాపార లావాదేవీలు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఈ కారణంగాణే ప్రపంచ బ్యాంక్ ‘లాజిస్టిక్ పెర్ఫామెన్స్ ఇండెక్స్ 2023’ జాబితాలో భారత్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. 139 దేశాల ఈ సూచికలో 2018లో 48వ ర్యాంక్‌లో ఉన్న భారత్, ఆరు స్థానాలు ఎగడాకి తాజా సూచికలో 38వ ర్యాంక్‌ని సొంతం చేసుకుంది.సాఫ్ట్ ఆండ్ హార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు టెక్నాలజీలోనూ గణనీయమైన పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్ ర్యాంక్ మెరుగుపడేందుకు దారితీసింది.
అంతర్జాతీయ షిప్‌మెంట్ 2013 లో కూడా భారత్ ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది. 2018లో 44వ స్థానంలోని భారత్ ఇప్పుడు 22కి చేరుకుంది. అలాగే లాజిస్టిక్స్ సామర్థ్యం, సమానత్వంలో కూడా 4 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్‌కు చేరింది. ఇంకా టైమ్‌లైన్ల ర్యాంకింగ్స్ పరంగా కూడా భారత్ 17 స్థానాలు ఎగబాకి గణనీయమైన మెరుగుదలని సాధించింది. అదనంగా ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్‌లో సైతం 3 స్థానాలను మెరుగుపరుచుకుని 38వ స్థానంలో నిలిచింది.
‘దేశంలో ఒక దాని తర్వాత మరొకదాని డిజిటలైజేషన్, ముఖ్యంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో 70 శాతం కంటే వేగంగా పోర్టులు అందుబాటులోకి వస్తుంటాయి. అలాగే భారత్‌లో గ్రీన్ లాజిస్టిక్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది. వీటితోపాటు 75% షిప్పర్లు వెతుకుతున్న పర్యావరణ అనుకూలమైన పరిస్థితులు ఇండియాలో ఉన్నాయ’ని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది.
మరోవైపు ‘ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇతరాలలో షిప్పింగ్ అనేది ఎక్కువ సమయం తీసుకుంటోంది. కాబట్టి దేశాలు ఈ అంశాలలో జాప్యాన్ని తగ్గించేలా పనిచేస్తే విశ్వసనీయతను మెరుగుపరచడంలో సహాయపడతాయ’ని ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కి చెందిన క్రిస్టినా వైడెరర్ పేర్కొన్నారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి