AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT రిఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్‌..! మీకూ ఆ మెసేజ్‌ వచ్చిందా..? అయితే జాగ్రత్త

ఇన్కమ్ ట్యాక్స్ శాఖ రీఫండ్ మోసాల గురించి హెచ్చరిక జారీ చేసింది. ఫోన్ లేదా మెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద సందేశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. బ్యాంక్ వివరాలు అడగడం, లింకులను తెరవడం వంటివి మోసాలకు దారితీయవచ్చు. రీఫండ్ వివరాలను e-filing పోర్టల్ ద్వారానే తెలుసుకోవాలి.

IT రిఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్‌..! మీకూ ఆ మెసేజ్‌ వచ్చిందా..? అయితే జాగ్రత్త
It Refund
SN Pasha
|

Updated on: Jul 20, 2025 | 1:52 PM

Share

మీరు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి రీఫండ్ కోసం చూస్తున్నారా? మీ బ్యాంకు ఖాతాను ధ్రువీకరించాలంటూ మీ ఫోన్‌కు లేదా మెయిల్‌కు మెసేజ్ వచ్చిందా? అయితే, మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాంటి మెసేజ్‌లు మోసపూరితమైనవి కావచ్చు. ఇలాంటి సందేశాలపై ట్యాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం హెచ్చరిస్తూ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కోటీన్నరకు పైగా మంది ఐటీ రిటర్నులు పూర్తి చేసిన క్రమంలో ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తు చేసింది. అనుమానాస్పద మెసేజ్ వస్తే దాని గురించి ముందుగా తెలుసుకోవాలని సూచించింది.

ఐటీ శాఖ హెచ్చరికలు

  • ట్యాక్సుకు సంబంధించి ఫోన్ లేదా మెయిల్ ద్వారా ఏదైనా సందేశం వచ్చినప్పుడు అది ట్యాక్సు విభాగం పంపించిందా లేదా అనేది పరిశీలించాలి.
  • ఇ-మెయిల్ లేదా ఫోన్ ఎస్ఎంఎస్‌ల రూపంలో వచ్చిన లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.
  • రీఫండ్ కోసం బ్యాంకు వివరాలు తెలుపుతూ ఓ ఫారాన్ని నింపాలంటూ ఏదైనా మెసేజ్ వచ్చింది అంటే దానిని అనుమానించాల్సిందే.
  • అలాంటి ఫారాల్లో మీ బ్యాంకు వివరాలు ఇచ్చి, ఓటీపీ ఎంటర్ చేశారంటే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.
  • రీఫండ్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలైనా ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారానే అందుబాటులో ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ విభంగా ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు కోరుతూ మెసేజ్, ఇ-మెయిల్ పంపించదు.

తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ పొందిన వారిపై ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది. ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అవగాహన కార్యక్రమాలు, సోదాల ద్వారా ఇప్పటికే 40 వేల మంది బోగస్ క్లెయిమ్స్ చేసినట్లు బయటపడింది. వారంతా సుమారు రూ.1000 కోట్ల వరకు తప్పుడు క్లెయిమ్స్ చేసి రీఫండ్ పొందినట్లు గుర్తించింది. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారని, ప్రధానంగా కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని హెచ్చరించింది. అలా తప్పుడు క్లెయిమ్స్ ద్వారా రీఫండ్ చేసిన వారు వెంటనే తమ ఐటీ రిటర్నులను సరి చేస్తూ అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయాలని కోరింది. తనిఖీలు నిర్వహించి దొరికితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అలాగే ఇప్పటి వరకు కోటీన్నర మంది వరకు తమ రిటర్నులను ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. వారంతా రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా లేడీ కోహ్లీ..!
భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా లేడీ కోహ్లీ..!
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..
మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా
మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా