Pan Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయని వారికి కీలక అప్‌డేట్.. లింక్ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఆదాయపు పన్ను శాఖ గత కొంత కాలం పాన్‌కు ఆధార్ లింక్ చేయాలని పౌరులకు సూచిస్తుంది. గడువు ముగిసిపోవడంతో రూ.1000 ఆలస్య రుసుముతో ఆధార్ పాన్ లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొదట్లో ఈ గడవు మార్చి 31 వరకూ ఉండగా తాజా ఈ గడువును జూన్ 30 అని మార్చారు.

Pan Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయని వారికి కీలక అప్‌డేట్.. లింక్ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Pan Aadhar Link

Updated on: Apr 14, 2023 | 6:30 PM

ప్రతి అవసరానికి ఆధార్ తప్పనిసరైంది. ప్రభుత్వం కూడా వ్యక్తిగత గుర్తింపునకు ఆధార్ తప్పని చేయడంతో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల్లో ఆధార్ తప్పనిసరైంది. ఆదాయపు పన్ను శాఖ గత కొంత కాలం పాన్‌కు ఆధార్ లింక్ చేయాలని పౌరులకు సూచిస్తుంది. గడువు ముగిసిపోవడంతో రూ.1000 ఆలస్య రుసుముతో ఆధార్ పాన్ లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొదట్లో ఈ గడవు మార్చి 31 వరకూ ఉండగా తాజా ఈ గడువును జూన్ 30 అని మార్చారు. అయితే ఆలస్య రుసుముతోనైనా పాన్‌కు ఆధార్ లింక్ చేసుకోవాలనుకునే వారికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఓ కీలక సూచన చేసింది. పాన్ ఆధార్ లింక్ చేసుకునే సమయంలో ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఆలస్య రుసుమును కూడా చెల్లించడానికి సమ్మతిని అడుగుతుంది. ఈ సమయంలో అసెస్‌మెంట్ సంవత్సరాన్ని 2024-25గా టిక్ చేసుకోవాలని సూచించింది. ఈ ఎంపిక గతంలో లేదు. కొత్తగా చేసుకునే వారికి ఈ ఎంపిక కనిపిస్తుంది. 

పాన్‌తో ఆధార్ లింక్ చేయండిలా

  • దశ 1: ఐటీ విభాగం యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించాలి.
  • దశ 2: వెబ్‌పేజీలోని ‘త్వరిత లింక్‌లు’ విభాగంలోని ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • దశ 3: ఇది మిమ్మల్ని కొత్త పేజీకి దారి మళ్లిస్తుంది, ఇక్కడ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పేరు వంటి ఇతర అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
  • దశ 4 : అనంతరం ఆలస్య రుసుమును చెల్లించే సమయంలో అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకుని ఆలస్య రుసుమును చెల్లించి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసుకోవచ్చు. 

ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోండిలా

యూఐడీపాన్ అని ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్‌ను టైప్ చేయాలి అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి 56161 లేదా 567678కు ఎస్ఎంఎస్ పంపితే పాన్‌తో ఆధార్ లింక్ అయ్యిందో? లేదో? చెక్ చేసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us