Bicycle Price: 1934లో సైకిల్‌ ధర ఎంత ఉందో తెలుసా..? ఈ బిల్లును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌

|

Jan 14, 2023 | 2:59 PM

ఈ రోజుల్లో అన్నింటి ధరలు పెరిగిపోయాయి. ఒకప్పుడు రూపాయల్లో ఉన్న ధర.. ఇప్పుడు వేలు, లక్షలు ఉన్నాయి. పూర్వకాలంలో ధరలు చాలా అంటే చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు మండిపోయే..

Bicycle Price: 1934లో సైకిల్‌ ధర ఎంత ఉందో తెలుసా..? ఈ బిల్లును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌
Bicycle Price
Follow us on

ఈ రోజుల్లో అన్నింటి ధరలు పెరిగిపోయాయి. ఒకప్పుడు రూపాయల్లో ఉన్న ధర.. ఇప్పుడు వేలు, లక్షలు ఉన్నాయి. పూర్వకాలంలో ధరలు చాలా అంటే చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు మండిపోయే ధరలు ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకు ఓ చిన్న బొమ్మ కొనివ్వాలన్నా.. 100 రూపాయలకు కూడా రాని రోజులివి. ఇక సాధారణంగా ఇంట్లో పిల్లాడికి సైకిల్‌ కొనివ్వాలంటే ఎంతుంటుంది దాదాపు రూ.4 నుంచి 5 వేల వరకు ఉంటుంది. అది మామూలు రెంజల్‌ సైకిల్‌ మాత్రమే. ఇంకా మంచి సైకిల్ కావాలంటే ఆపై ధర పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓ సైకిల్‌ కొనుగోలుకు చెందిన బిల్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ బిల్లు చిటీ దాదాపు 89 క్రితం నాటిది. మరి అప్పటి బిల్లు స్లిప్‌ ఎలా దాచుకున్నారో తెలియదు గానీ.. అప్పట్లో ధరలు చూస్తే అప్పటికి.. ఇప్పటికీ ఎంత తేడా ఉందో తెలిసిపోతుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ సైకిల్‌ బిల్లు 1934 నాటిది. కోల్‌కతాలోని ఒక సైకిల్ షాప్‌లో అమ్మిన సైకిల్ ధర ఎంతో తెలుసా..? కేవలం 18 రూపాయలు మాత్రమే. ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. నమ్మి తీరాల్సిందే.

ఈ బిల్లుపై సైకిల్ ధర స్పష్టంగా ఉన్నట్లు మీరు గమనించవచ్చు. ఆ సంవత్సరంలో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన సైకిల్‌కు సంబంధించిన బిల్లు జనవరి 7, 1934 నాటిదని కూడా గమనించవచ్చు. ఈ బిల్లుకు సంబంధించిన ఫోటోను సంజయ్ ఖరే అనే ఫేస్‌బుక్ యూజర్ షేర్ చేశాడు. సంజయ్ ఖరే ఈ పాత బిల్లును పోస్ట్ చేస్తూ.’ఒకప్పుడు సైకిల్ కొనడం అనేది మా తాతగారి డ్రీమ్. సైకిల్ చక్రంలా, కాలచక్రం ఎంత తిరిగింది!’ అని చెప్పుకొచ్చాడు. ఈ స్లిప్‌లో షాపు పేరు ‘కుముద్ సైకిల్ వర్క్స్’ అని రాసి ఉండటం ఈ బిల్లులు మీరు గమనించవచ్చు.అలానే ఈ షాప్ అడ్రస్ షాప్ నంబర్- 85A, మానిక్తల, కలకత్తా అని చాలా చక్కగా రాసి ఉంది.


ద్రవ్యోల్బణం వల్ల ఇప్పుడు సైకిల్‌ ధరలు మండిపోతున్నాయి. చిన్న పిల్లల సైకిల్‌ కూడా ఈ రోజుల్లో ఎంత తక్కువ అన్నా 4 నుంచి 5 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పాత బిల్లును చూసిన వారు ఎన్నో ఏళ్ల నాటి సైకిల్‌ ఇప్పటి వరకు దాచడం చాలా గొప్ప విషయమని కామెంట్లు చేస్తున్నారు. 89 ఏళ్ల నాటి బిల్లు ఇప్పటికి దాచి ఉంచారంటే మామూలు విషయం కాదంటూ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి