ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకులో హర్ ఘర్ లఖ్ పతి అనే ఆర్డీ పథకం అమలవుతోంది. చిన్న మొత్తంలో ప్రతినెలా డిపాజిట్ చేయడం ద్వారా రూ.లక్ష, అంతకంటే ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. నిర్ణీత కాలానికి హామీ ఇచ్చిన మొత్తం పొందగలిగే అవకాశం లభిస్తుంది. రిస్కు లేకుండా క్రమబద్దమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ పథకంలో మూడు, నాలుగేళ్ల డిపాజిట్లకు 6.75, అంతకు మించితే 6.50 శాతం వడ్డీ అందిస్తారు. వరుసగా ఆరు నెలల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేయకపోతే ఖాతా మూసివేస్తారు. అప్పటి వరకూ కట్టిన డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా వడ్డీరేట్లు అమలవుతాయి.
నిర్ణీత సమయానికి స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఎస్బీఐ లఖ్ పతి ఆర్డీ పథకం అనువుగా ఉంటుంది. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత కాలవ్యవధికి డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తాలతో చేసే ఈ పొదుపులు పిల్లల చదువులు తదితర అత్యవసర అవసరాలకు ఉపయోగపడతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి