మీకు ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలున్నాయి..? అయితే నష్ట పోతున్నారు..! అసలు విషయం తెలుసుకోండి..

|

May 03, 2021 | 6:14 PM

More Than Bank Accounts : బ్యాంకులు ఆఫర్లు ప్రకటించడంతో జనాలు పాత ఖాతాలను మరిచిపోయి కొత్త ఖాతాలను తెరుస్తారు. దీంతో కొంతమంది

మీకు ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలున్నాయి..? అయితే నష్ట పోతున్నారు..! అసలు విషయం తెలుసుకోండి..
Bank Image
Follow us on

More Than Bank Accounts : బ్యాంకులు ఆఫర్లు ప్రకటించడంతో జనాలు పాత ఖాతాలను మరిచిపోయి కొత్త ఖాతాలను తెరుస్తారు. దీంతో కొంతమంది పాత ఖాతాలను మీకు తెలియకుండా యధేచ్చగా వాడుతున్నారు. ఢిల్లీకి చెందిన సుమిత్ త్యాగి ఐటి కంపెనీలో పనిచేస్తున్నాడు. తన పాత ఖాతా ద్వారా మోసం జరిగిందని బ్యాంకు నుంచి అతడికి ఒక రోజు కాల్ వచ్చింది. వెంటనే అతడు బ్యాంకుకు వెళ్లి ఈ ఖాతాను చాలా సంవత్సరాలుగా వాడటం లేదని చెప్పాడు. అటువంటి సమయంలో అతడికి బ్యాంకు నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.

మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటే అది క్రియారహితంగా మారితే వెంటనే వాటిని క్లోజ్ చేయండి. లేదంటే రాబోయే కాలంలో పెద్ద సమస్యలు ఎదురవుతాయి. మీ ఖాతాలో మూడు నెలలు జీతం క్రెడిట్ కాకపోతే వెంటనే ఆ ఖాతా పొదుపు ఖాతాగా మారుతుంది. పొదుపు ఖాతాలో మార్పు వచ్చినప్పుడు బ్యాంక్ కొత్త నియమాలు వర్తిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు పొదుపు ఖాతాలో కనీస మొత్తాన్ని నిర్వహించాలి. ఒకవేళ నిర్వహించకపోతే మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. బ్యాంక్ మీ ఖాతాలో జమ చేసిన మొత్తం నుంచి డబ్బును కట్ చేయవచ్చు.

చాలా బ్యాంకులలో ఖాతా ఉన్నందున మీరు అన్ని ఖాతాలలో కనీస బ్యాలెన్స్ కలిగి ఉండాలి. నిర్ణీత మొత్తాన్ని అందులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ డబ్బు మొత్తం ఖాతాల మెయింటనెన్స్‌కే సరిపోతుంది. అంతేకాదు కేవలం మీకు 4 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. అదే ఆ డబ్బులు వేరేదాంట్లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. మీరు చాలా బ్యాంకు ఖాతాల విషయంలో సేవా ఛార్జీలు చెల్లించాలి. అటువంటి పరిస్థితిలో మీరు సేవను సద్వినియోగం చేసుకోకుండా పెద్ద మొత్తంలో ఛార్జీలుగా చెల్లిస్తారు.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండటం మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేనందున క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. అటువంటి పరిస్థితిలో రుణం తీసుకోవడంలో మీరు సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే వాడని ఖాతాలను క్లోజ్ చేయండి.. బ్యాంక్ ఖాతాను మూసివేసేటప్పుడు మీరు చాలా విషయాలను తెలుసుకోవాలి. అందులో మొదటిది మీరు D- లింక్ ఫారమ్ నింపాలి. ఖాతా మూసివేత ఫారం బ్యాంక్ శాఖలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఖాతా మూసివేస్తున్నప్పుడు కారణం చెప్పాలి. మీ ఖాతా ఉమ్మడి ఖాతా అయితే ఇద్దరి సంతకాలు అవసరం.

మీరు రెండో ఫారమ్‌ను కూడా పూరించాలి. ఇందులో మిగిలిన డబ్బును వేరే ఖాతాకు బదిలీ చేసుకోవాలి. ఖాతాను మూసివేయడానికి మీ ఖాతా ఉన్న బ్యాంకు మీరు కచ్చితంగా వెళ్లాలి. అకౌంట్ తెరిచిన 14 రోజుల్లో ఖాతా మూసివేయడానికి బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయవు. 14 రోజుల తరువాత, ఒక సంవత్సరం పూర్తయ్యే ముందు ఖాతాను మూసివేస్తే మీరు ఖాతా మూసివేత ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.

ఉపయోగించని చెక్‌బుక్, డెబిట్ కార్డుతో పాటు బ్యాంక్ క్లోజర్ ఫారమ్‌ను జమ చేయమని బ్యాంక్ మిమ్మల్ని అడుగుతుంది. ఖాతాలో ఉన్న డబ్బును మీ ఇతర బ్యాంకు ఖాతాకు బదిలీ చేసే అవకాశం కూడా మీకు ఉంటుందని గుర్తుంచుకోండి. మీ ఖాతాలో మీకు ఎక్కువ డబ్బు ఉంటే మూసివేత ప్రక్రియను ప్రారంభించే ముందు దాన్ని మరొక ఖాతాకు బదిలీ చేయండి. ఖాతా మూసివేత గురించి ప్రస్తావిస్తూ చివరిసారిగా జరిపిన లావాదేవీల సాక్ష్యాలను మీ వద్ద ఉంచుకోండి.

కరోనా కోసం సిటి స్కాన్ చేయిస్తున్నారా ? అయితే డేంజర్ అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్..

COVID19 Vaccination: మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్ వివరాలు వాట్సాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు… ఎలా అంటే..!