Loan EMI: లోన్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? ఇలా చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు..

| Edited By: Ram Naramaneni

Nov 01, 2023 | 10:12 PM

ప్రతినెలా నిర్ణీత సమయంలో రుణ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్ బౌన్స్ అయినా.. అది మీకు పెద్ద సమస్య మారే అవకాశం ఉంది. మీ ఇన్‌స్టాల్‌మెంట్ మొదటిసారి బౌన్స్ అయినప్పుడు, బ్యాంక్ పెనాల్టీ విధిస్తుంది. అదే రెండు ఈఎంఐలు వరుసగా చెల్లించకపోతే బ్యాంక్ రిమైండర్ లెటర్ జారీ చేస్తుంది. ఇక వరుసగా మూడోసారి కూడా ఈఎంఐ బౌన్స్ అయితే బ్యాంక్ కఠినమైన వైఖరిని తీసుకుంటుంది.

Loan EMI: లోన్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? ఇలా చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు..
Loan Emi
Follow us on

మనిషి జీవితం రుణాలమయం అవుతోంది. నిజమేనండి.. ఏది కావాలన్నా లోన్.. ఏది కొనాలన్నా ఈఎంఐ. ఇల్లు కట్టాలన్నా అప్పే.. బైక్ కొనాలన్నా లోనే. అది అనివార్యం అయిపోతున్న పరిస్థితి. సంపాదిస్తున్న కొంచెం మొత్తంలోనే అన్నీ సమకూర్చుకోవాలంటే కష్టతరం అవుతున్న వాతావరణంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరం అవుతోంది. ఇంట్లో వస్తువుల నుంచి అన్నింటిని ఈఎంఐల రూపంలో మనం తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నాం. సామాన్య మధ్య తరగతి నుంచి కోటీశ్వరులైన బిజినెస్ మ్యాన్ల వరకూ లోన్లు సర్వసాధారణం అయిపోయాయి. అయితే లోన్లు తీసుకునేటప్పుడు దానిని వినియోగించుకునే టప్పడు అంతా బాగానే ఉంటుంది. అది తిరిగి ఈఎంఐల రూపంలో చెల్లించే క్రమంలోనే ఇబ్బందులు తలెత్తుతాయి.

ప్రతినెలా నిర్ణీత సమయంలో రుణ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్ బౌన్స్ అయినా.. అది మీకు పెద్ద సమస్య మారే అవకాశం ఉంది. మీ ఇన్‌స్టాల్‌మెంట్ మొదటిసారి బౌన్స్ అయినప్పుడు, బ్యాంక్ పెనాల్టీ విధిస్తుంది. అదే రెండు ఈఎంఐలు వరుసగా చెల్లించకపోతే బ్యాంక్ రిమైండర్ లెటర్ జారీ చేస్తుంది. ఇక వరుసగా మూడోసారి కూడా ఈఎంఐ బౌన్స్ అయితే బ్యాంక్ కఠినమైన వైఖరిని తీసుకుంటుంది. మీ కేసును నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ)గా పరిగణిస్తుంది. అదే సమయంలో, రికవరీ ప్రక్రియ ప్రారంభిస్తుంది. వీటన్నంటికంటే ఈ బౌన్స్ అయిన ఈఎంఐ కారణంగా మీ సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఇది మీ భవిష్యత్తు లోన్ అవసరాలకు గండి కొడుతుంది. ఈ నేపథ్యంలో మీరు సకాలంలో లోన్ ఈఎంఐ చెల్లించలేని పరిస్థితిలో కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మిమ్మల్ని మీరు దాని పర్యావసనాల నుంచి కాపాడుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

మేనేజర్‌తో మాట్లాడండి.. పొరపాటున లేదా ఏదైనా బలవంతం వల్ల ఈఎంఐ బౌన్స్ అయినట్లయితే, ముందుగా మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి, బ్యాంక్ మేనేజర్‌ని కలుసుకుని, మీ సమస్యను వివరించండి. భవిష్యత్తులో ఇలా జరగదని వారికి భరోసా ఇవ్వండి. అటువంటి పరిస్థితిలో, భవిష్యత్తులో ఇలా చేయవద్దని బ్యాంక్ మేనేజర్ మీకు సలహా ఇస్తారు. తదుపరి వాయిదాను సకాలంలో చెల్లించమని మిమ్మల్ని అడుగుతారు. అయితే బ్యాంకు ద్వారా పెనాల్టీ విధించినప్పటికీ, మీరు దానిని చెల్లించలేనంతగా ఉండదు. ఒకవేళ మీరు కొంత సమయం వరకు లోన్ ఈఎంఐని చెల్లించలేరని మీరు భావిస్తే, మీరు కొంత సమయం పాటు ఈఎంఐని నిలిపివేయమని అభ్యర్థించవచ్చు. దీని కోసం, మీరు దరఖాస్తు చేసుకోవాలి. కొంత సమయం తరువాత, డబ్బు ఏర్పాటు అయినప్పుడు, మీరు మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇది కష్ట సమయాల్లో మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏరియర్ ఈఎంఐ ఆప్షన్.. మీ జీతం ఆలస్యంగా వచ్చి, మీరు ఈఎంఐ తేదీ లోపు నిధులను ఏర్పాటు చేయలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో మీ ఈఎంఐ బౌన్స్ అయితే మీరు ఏరియర్ ఈఎంఐ కోసం బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడవచ్చు. రుణ వాయిదా తేదీ సాధారణంగా నెల ప్రారంభంలో ఉంటుంది, దీనిని అడ్వాన్స్ ఈఎంఐ అంటారు. చాలా మంది రుణ గ్రహీతలకు ముందస్తు ఈఎంఐ ఎంపిక ఉంది. కానీ మీకు కావాలంటే, మీరు ఏరియర్ ఈఎంఐ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు మీరు నెలాఖరులో మీ వాయిదాను చెల్లిస్తారు.

సిబిల్ స్కోర్.. వరుసగా మూడు నెలల పాటు ఈఎంఐ బౌన్స్ అయితే, బ్యాంక్ మేనేజర్ సిబిల్ స్కోర్ నివేదికను పంపుతారు. మీ లోన్ ఈ వ్యవధి కంటే తక్కువ వ్యవధిలో బౌన్స్ అయినట్లయితే, మీ సిబిల్లో ప్రతికూల నివేదికను పంపవద్దని మీరు బ్యాంక్ మేనేజర్‌ని అభ్యర్థించాలి.ఒకసారి సిబిల్ స్కోర్ తగ్గితే మీరు భవిష్యత్తులో లోన్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.

రుణ పరిష్కారం.. మీరు రుణం తీసుకున్నా, ఆ తర్వాత పరిస్థితి మారి, రుణ వాయిదా చెల్లించలేని పరిస్థితిలో, బ్యాంకు మేనేజర్‌ని కలుసుకుని, లోన్ సెటిల్‌మెంట్ గురించి మాట్లాడవచ్చు. అయితే, బ్యాంక్ దీనికి కారణాన్ని అడుగుతుంది, మీ సమాధానం సహేతుకమైనది అయితే, అప్పుడు మాత్రమే మీ అభ్యర్థన అంగీకరించబడుతుంది. రుణ పరిష్కారం సమయంలో, రుణగ్రహీత, రుణం ఇచ్చే బ్యాంకు మధ్య చర్చలు జరుగుతాయి. ఇద్దరూ కొంత మొత్తాన్ని అంగీకరించిన తర్వాత, రుణగ్రహీత రుణం సెటిల్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. బ్యాంకింగ్ భాషలో దీనిని వన్ టైమ్ సెటిల్‌మెంట్ అంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..