Credit Card: మీరు ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి బాదుడే బాదుడు..

|

Jan 11, 2022 | 1:47 PM

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వినియోగదారులకు ఆయా బ్యాంకులు సులభంగా క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి..

Credit Card: మీరు ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి బాదుడే బాదుడు..
Follow us on

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వినియోగదారులకు ఆయా బ్యాంకులు సులభంగా క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై ఛార్జీల మోత మోగిస్తోంది. కార్డులో వాడుకున్న డబ్బులను గడువులోగా చెల్లించకుండా ఆలస్యం అయినట్లయితే గరిష్టంగా రూ.1200 వరకు పెనాల్టీ వేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. అన్ని క్రెడిట్‌ కార్డుల కస్టమర్లు క్యాష్‌ అడ్వాన్స్‌పై 2.5 శాతం లావాదేవీ చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎంలలో నగదు తీసుకున్నట్లయితే ఆ నగదుపై మొదటి రోజు నుంచే వడ్డీ రేటు పడుతుంది.

ఇక విదేశీ ప్రయాణాల్లో ఆయా దేశాల కరెన్సీని తీసుకున్నట్లయితే అదనపు చార్జీలు విధిస్తారు. అందుకే క్రెడిట్‌ కార్డులు వాడే ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే చార్జీల మోత మోగనుంది. క్రెడిట్‌ కార్డుల్లో డబ్బులు ఉన్నాయని ఇష్టానుసారంగా వాడుకుని గడువులోగా చెల్లించినట్లయితే అప్పుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది.

దేనికి ఎంత చార్జీలు

► అన్ని కార్డులపై క్యాష్‌ అడ్వాన్స్‌ లావాదేవీలపై 2.5 శాతం అంటే కనీసం రూ.500 వరకు చార్జీలు పడతాయి.

► చెక్‌ రిటర్న్‌ విషయంలో మొత్తం బకాయిలో 2 శాతం అంటే రూ.500 వసూలు చేస్తారు.

► ఆటో డెబిట్‌రిటర్న్‌.. మొత్తం బకాయిలో 2 శాతం అంటే కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

► అన్ని క్రెడిట్‌ కార్డులపై గడువులోగా చెల్లించకుండా ఆలస్యంగా చెల్లించినట్లయితే మొత్తం బకాయిలలో రూ.100-500 వరకు ఉంటే రూ.100

► రూ.501-5000 వరకు బకాయి ఉంటే రూ.500 వరకు చార్జీ పడుతుంది.

► 5001-10,000 వకకు ఉంటే రూ.750చార్జీ

► రూ.10,001-25,000 వరకు బకాయి ఉంటే రూ.900

► రూ.25,001-50,000 వరకు ఉంటే రూ.1200 వరకకు పెనాల్టీ పడుతుంది.

► అయతే రూ.100లోపు బకాయి ఉంటే ఎలాంటి చార్జీ పడదు.

ఇవి కూడా చదవండి:

Amazon Great Republic Day Sale: మరో బంపర్‌ ఆఫర్లతో కస్టమర్లకు ముందుకు అమెజాన్‌.. ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..!

Maruti Suzuki Cars: కారు కొనుగోలు చేసేవారికి మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌.. ఈ కార్లపై రూ.33,000 వరకు డిస్కౌంట్‌