ICICI Bank: సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసిఐసిఐ బ్యాంక్‌కు లాభాల పంట
దేశంలోని ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ..

దేశంలోని ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం 31.43 శాతం పెరిగి రూ. 8,006.99 కోట్లకు చేరుకుంది. ఈ సమాచారాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ ట్విటర్‌లో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టాండలోన్ ప్రాతిపదికన, సెప్టెంబర్ త్రైమాసికంలో 37.14 శాతం వృద్ధితో రూ.7,557.84 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది 2021 ఇదే కాలంలో ఈ సంఖ్య రూ.5,510.95 కోట్లు. ఐసీఐసీఐ ఫలితాల ప్రకారం.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 31,088 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయం రూ .18,027 కోట్ల నుంచి రూ.19,408 కోట్లకు పెరిగింది.
ఈ కాలంలో ఐసిఐసిఐ బ్యాంక్ మొండి బకాయిల కోసం ఆర్థిక కేటాయింపు రూ. 1,644.52 కోట్లకు తగ్గిందని నివేదిక తెలిపింది. ఇది ఏడాది క్రితం రూ.2,713.48 కోట్లు. అయితే జూన్ త్రైమాసికంలో ఇది రూ.1,143.82 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. శుక్రవారం బిఎస్‌ఇలో బ్యాంక్ షేరు 2.13 శాతం లాభంతో రూ. 907.15 వద్ద ముగియగా, బెంచ్‌మార్క్ 0.18 శాతం పెరిగింది.




Performance review for quarter ended September 30, 2022 (Q2-2023)
The Bank’s profit after tax grew by 37% Y-o-Y to ₹7,558 crore in Q2-2023#ICICIBank #Q2FY23 #FinancialResults #QuarterlyResults pic.twitter.com/AlQIc5QilS
— ICICI Bank (@ICICIBank) October 22, 2022
మార్చి కంటే జూన్‌లో తక్కువ లాభం:
బ్యాంక్ జూన్ నెలలో దాని నికర లాభంలో 50 శాతం పెరిగి రూ. 6,905 కోట్లకు స్టాండలోన్ ప్రాతిపదికన ఉంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.4,616 కోట్ల నికర లాభం. అదే జూన్ త్రైమాసికంలో నికర లాభం మార్చి త్రైమాసికంలో రూ.7,018.71 కోట్ల కంటే తక్కువగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




