
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని మంగళూరు మధ్య నడిపిన ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన (రెస్పాన్స్) వచ్చింది. అలాగే ఈ రూట్‌లో సేవులను మరికొంత కాలం కొనసాగించాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్, మంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల రాకపోకలను మరో ఐదు ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది.
రైలు నంబర్ 07097 (హైదరాబాద్ – మంగళూరు సెంట్రల్): ఆగస్టు 5, 12, 19, 26 తేదీలలో హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది.
రైలు నంబర్ 07098 (మంగళూరు సెంట్రల్ – హైదరాబాద్): ఆగస్టు 6, 13, 20, 27 సెప్టెంబరు 3వ తేదీలలో మంగళూరు నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వస్తుంది.
కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారం ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటకలోని ప్రధాన స్టేషన్ల గుండా రాపోకలు సాగిస్తాయి. అలాగే బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, గుంతకల్, అనంతపురం, యలహంక, కృష్ణరాజపురం, సేలం, పాలక్కాడ్, కోళికోడ్, వడకర, కాసర్‌గోడ్ స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక ట్రైన్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.