Budget 2024: గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు! నిర్మలమ్మ బడ్జెట్లో కీలక నిర్ణయం..

|

Jul 11, 2024 | 3:11 PM

ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం బడ్జెట్ నిర్ణయాలపై చాలా ఆశలు పెట్టుకుంది. గృహ కొనుగోలుదారులు, డెవలపర్లు వడ్డీ రేట్లు తగ్గింపుతో పలు ప్రోత్సాహకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పరిశ్రమ హోదా చాలా కాలంగా పెండింగ్లో ఉంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Budget 2024: గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు! నిర్మలమ్మ బడ్జెట్లో కీలక నిర్ణయం..
Real Estate Expectations On Budget
Follow us on

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త బడ్జెట్ కోసం సిద్ధమవుతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఈ క్రమంలో అన్ని రంగాలవారు బడ్జెట్ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏం ప్రోత్సహకాలు ఉంటాయి? ఏమేమి అంశాల్లో భారం పడుతుంది? ఎక్కడ కోతలు విధిస్తారు? వంటిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం బడ్జెట్ నిర్ణయాలపై చాలా ఆశలు పెట్టుకుంది. గృహ కొనుగోలుదారులు, డెవలపర్లు వడ్డీ రేట్లు తగ్గింపుతో పలు ప్రోత్సాహకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పరిశ్రమ హోదా చాలా కాలంగా పెండింగ్లో ఉంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బడ్జెట్ అంచనాలు ఇవి..

రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిపుణులు జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2024పై ఆసక్తిగా ఉన్నారు. కొన్ని ప్రోత్సాహకాలుంటాయని, హోమ్ లోన్లపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటివి ఉంటాయని చెబుతున్నారు. రూ. 30లక్షల నుంచి రూ. 35 లక్షల ధర గల యూనిట్లకు హౌసింగ్ లోన్ వడ్డీ రాయితీలను కూడా ప్రభుత్వం పరిగణించవచ్చని వివరిస్తున్నారు. హోమ్ లోన్ ప్రిన్సిపల్ పేమెంట్‌కి తగ్గింపుతో సహా, హోమ్ లోన్‌లపై తగ్గింపు పరిమితిలో ఏదైనా పెరుగుదలను కూడా లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పరిశ్రమ హోదా వస్తుందా?

అంతేకాక మరో ప్రధానమైన అంశాన్ని కూడా రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే రాబోయే బడ్జెట్‌లో తమకు పరిశ్రమ హోదా లభిస్తుందని రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆశిస్తున్నట్లు వివరిస్తున్నారు. పరిశ్రమ హోదా అనేది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తమను ప్రత్యేక, వ్యవస్థీకృత రంగంగా గుర్తించడానికి అనుమతిస్తుందని వివరిస్తున్నారు. అంతేకాక పరిశ్రమ హోదా ఉంటే రంగానికి అవసరమైన నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి అనుకూలీకరించిన కార్యక్రమాలు, రాయితీలను అందిస్తుందని చెబుతున్నారు. అలాగే క్యాపిటల్, వడ్డీ రాయితీలు, సింగిల్-విండో సిస్టమ్‌ల ద్వారా త్వరితగతిన లైసెన్సింగ్, స్టాంప్ డ్యూటీలు, టారిఫ్‌లు, ఇతర ఛార్జీలలో తగ్గింపులు లేదా మినహాయింపులు వంటి చట్టపరమైన, పరిపాలనాపరమైన ప్రోత్సాహకాలతో సహా అనేక ప్రయోజనాలను తెస్తుందంటున్నారు. పరిశ్రమ హోదా కలిగిన రంగాలు క్రమబద్ధీకరించబడిన ప్రక్రియలు, వారి అభివృద్ధికి తోడ్పడేందుకు రూపొందించబడిన ఆర్థిక ప్రోత్సాహకాల నుంచి ప్రయోజనం పొందుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..