Bank: కస్టమర్లను అప్రమత్తం చేసిన ప్రైవేట్ బ్యాంక్‌.. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ..

సైబర్‌ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ కస్టమర్లను ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ అలర్ట్ చేసింది. కొందరు సైబ్‌ నేరగాళ్లు నకిలీ మెసేజ్‌లు, వాట్సాప్‌ గ్రూప్‌ల పేరుతో మోసం చేస్తున్నారని తెలిపింది. ఈ విషయమై ఖాతాదారులకు పలు కీలక సూచనలు చేసింది...

Bank: కస్టమర్లను అప్రమత్తం చేసిన ప్రైవేట్ బ్యాంక్‌.. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ..
Bank

Updated on: Nov 09, 2024 | 3:25 PM

పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా నకిలీ కాల్స్, మెసేజ్‌ల రూపంలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసాన్ని గుర్తించింది ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకు హెచ్‌ఎస్‌బీసీ. తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేరిట వస్తున్న నకిలీ కాల్స్, సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ముఖ్యంగా వాట్సాప్‌ ఛానల్స్‌ ద్వారా జరుగుతోన్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మొబైల్‌ నంబర్లు, వాట్సప్‌ ఛానళ్ల గురించి హెచ్‌డీఎఫ్‌సీ తమ కస్టమర్లను ఆదేశించింది. హెచ్‌ఎస్‌బీసీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ సీఐఓ (చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌) అయిన వేణుగోపాల్‌ మంఘాట్‌తో సంబంధం ఉన్నట్లు కొందరు తప్పుడు సర్టిఫికేట్ల పేరుతో కస్టమర్లకు వల వేస్తున్నారు

ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపిన బ్యాంక్‌.. ‘85-HSBC Global academy’ పేరిట ఆ కేటుగాళ్లు వాట్సప్‌ గ్రూప్‌ నడుపుతున్నారని, ఇది బ్యాంకుకు సంబంధించినది కాదని తేల్చి చెప్పారు. ‘8008723938’ ఫోన్‌ నంబర్‌తో వినియోగదారులను కేటుగాళ్లు కాంటాక్ట్‌ అవుతున్నారని, ఈ నంబర్‌ నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మొద్దంటూ మెయిల్‌ ద్వారా కస్టమర్లకు సూచించింది. వాట్సాప్‌తో పాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ అయిన.. ఎక్స్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డిన్‌, యూట్యూబ్‌ వంటి వేదికగా కూడా మోసాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.

అధికారిక వెబ్‌సైట్‌ కాకుండా.. సంస్థ పేరిట వచ్చే ఇతర ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించొద్దని తెలిపింది. బ్యాంకు పేర్కొన్న నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించకూడదని తెలిపారు. అలాగే ఆ నెంబర్ల నుంచి ఎవరైనా గ్రూప్‌లో జాయిన్‌ చేస్తే వెంటనే ఎగ్జిట్‌ అవ్వాలని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..