ఇ-కామర్స్ సైట్‌ల ప్రపంచం చాలా పెద్దది. ఇవి మన జీవితాలను చాలా సులభతరం చేసింది. మందుల నుంచి కిరాణా సామాగ్రి వరకు, తిండి నుంచి బస్ టిక్కెట్ల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే లభిస్తాయి. నగరాల్లో నివసించే వారికి ఈ సైట్‌లు నీరు, గాలి అంతా ముఖ్యమైనవి గా మారిపోయాయి. ఈ రోజుల్లో అవి లేకుండా బతకడం కష్టం. వాటిపై చేసే ఖర్చు మన ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతున్నప్పటికీ, అవి మన సేవింగ్స్ ని పాడు చేస్తున్నాయనేది వాస్తవం. అటువంటి పరిస్థితిలో మన అవసరాలపై రాజీ పడకుండా ఈ సైట్‌లలో ఖర్చులను ఆదా చేయడానికి ఏదైనా మార్గం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అవును ఉంది. ఈ స్పెషల్ స్టోరీలో అవేమిటో తెలుసుకుందాం.
ముందుగా మనం ప్రీమియం మెంబర్‌షిప్ గురించి చూద్దాం. Amazon, Flipkart, Myntra వంటి ఇ-కామర్స్ సైట్‌లతో పాటు, Swiggy, Zomato వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, Youtube, Voot వంటి స్ట్రీమింగ్ సర్వీస్ యాప్‌లలో కూడా ప్రీమియం మెంబర్ షిప్ అందుబాటులో ఉంది. ఇవి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఈ ప్రీమియం మెంబర్ షిప్ తో క్వాలిటీ సర్వీస్ దొరికే అవకాశం ఉంటుంది.
రోజువారీ అవసరాల నుంచి బట్టలు, బూట్లు, గడియారాలు వంటి ఫ్యాషన్ వస్తువుల వరకు మనం ఇ-కామర్స్ సైట్‌ల నుంచి ప్రతిదీ కొనుగోలు చేస్తాము. ప్రీమియం మెంబర్‌షిప్ విషయానికి వస్తే, Amazon Prime, Flipkart Plus , Myntra Insider వంటి వివిధ ఎంపికలు ఉన్నాయి. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కొంత డబ్బు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అదే Flipkart Plus, Myntra ఇన్‌సైడర్ మెంబర్‌షిప్‌లు కొంత మొత్తంలో కొనుగోళ్లు చేసిన తర్వాత మనకు వచ్చేగిఫ్ట్ కాయిన్స్ ద్వారా రెడీమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, ఫ్లిప్‌కార్ట్‌లో మనకు ప్రతి కొనుగోలుతో దాని విలువను బట్టి కాయిన్స్ క్రెడిట్ అవుతాయి. అలా మనం 200 నాణేలను సేకరించిన తర్వాత మనం వాటిని ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ కోసం రీడీమ్ చేసుకోవచ్చు. మెంబర్‌షిప్ ప్రయోజనాలలో ప్రొడక్ట్ డిస్కౌంట్స్, ఫ్రీ షిప్పింగ్, యాక్సెస్ బిఫోర్ సేల్, సేమ్ డే డెలివరీ, బెస్ట్ కస్టమర్ సపోర్ట్, ఎడిషనల్ ఆఫర్స్ ఇలా ఎన్నో ఉంటాయి.
Zomato Gold, Swiggy One వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ప్రీమియం మెంబర్‌షిప్‌లు సర్జ్ ఫీజును మినహాయించాయి. దానితో పాటు, మీరు ఎటువంటి దూరానికైనా ఫ్రీ డెలివరీ, అడిషనల్ డిస్కౌంట్, ఆన్-టైమ్ గ్యారెంటీ, VIP యాక్సెస్, టాప్ రెస్టారెంట్‌లలో డైనింగ్‌పై 40% వరకు తగ్గింపు వంటి ప్రయోజనాలను పొందుతారు. అదేవిధంగా ఆన్‌లైన్ రిజర్వేషన్ ప్లాట్‌ఫారమ్ Dineout పాస్‌పోర్ట్, EazyDiner ప్రీమియం మెంబర్‌షిప్‌లు EazyDiner నుంచి టాప్ బార్‌లు, రెస్టారెంట్‌లు, కేఫ్‌లు, మరిన్నింటికి ప్రత్యేకమైన యాక్సెస్‌ను అందిస్తాయి. అదనంగా మీరు టాప్ రెస్టారెంట్‌లలో బిల్లుపై 25 నుంచి 50 శాతం వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.
అలాగే, Netmeds నుంచి Netmeds First, PharmEasy నుంచి PharmEasy Plus వంటి ఈ-ఫార్మసీల ప్రీమియం సభ్యత్వాలను తీసుకోవచ్చు. ఔషధాలను ఆర్డర్ చేయడంపై 5% క్యాష్‌బ్యాక్, డయాగ్నస్టిక్స్‌పై క్యాష్‌బ్యాక్, ఉచిత డెలివరీ, ఉచిత డాక్టర్ సంప్రదింపులు వాటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కిరాణా డెలివరీ యాప్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది. Swiggy One, Insta Mart లేదా BB Star, Big Basketతో మీరు అదనపు ఆఫర్‌లు, ఉచిత డెలివరీ, ప్రాధాన్యతా స్లాట్‌లు, ఎలాంటి సర్జ్ ఫీజులు లేకుండా పొందవచ్చు. అందుకే మీరు ఆన్‌లైన్ మార్కెట్ నుంచి ప్రీమియం మెంబర్ షిప్ తీసుకొని మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు. అయితే, మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉపయోగించే యాప్ ల ప్రీమియం మెంబర్ షిప్ లు మాత్రమే తీసుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి