AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: సైబర్ క్రైమ్ వలలో చిక్కుకున్నారా? ఎలా బయటపడాలంటే..

పెరుగుతున్న సైబర్ క్రైమ్, సైబర్ మోసాలపై సర్వే ఫోకస్ పెట్టింది. సైబర్ మోసంగా పిలిచే ఆర్థిక మోసం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు స్పష్టమైంది. దాదాపు ప్రతిరోజూ దేశంలో ఎవరో ఒకరు సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వేల నుంచి లక్షల రూపాయల వరకు ప్రజలను మోసం చేస్తున్నారు. వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. వీటిలో డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు, UPI మోసాలు, కొరియర్ మోసాలు, ఇతర రకాల మోసాలు ఉన్నాయి. స్కామర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజలను దోపిడీ చేశారు..

Cyber Crime: సైబర్ క్రైమ్ వలలో చిక్కుకున్నారా? ఎలా బయటపడాలంటే..
Cyber Crime
Subhash Goud
| Edited By: |

Updated on: Jan 17, 2024 | 2:15 PM

Share

కొన్ని రోజులుగా మనీష్ ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే అతడికి ఓ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను బ్యాంకు నుంచి చేస్తున్నట్టుగా చెప్పాడు. మనీష్ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడం కోసం కాల్ చేశానన్నాడు. కేవైసీ అప్‌డేట్ సాకుతో కాలర్.. మనీష్ బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డ్ వివరాలను తీసుకున్నాడు. అంతే.. కొద్ది నిమిషాల్లోనే మనీష్ ఖాతా నుంచి 50 వేల రూపాయలు డ్రా అయ్యాయి. ఇది చాలా పెద్ద మోసమని మనీష్ కు ఆ తరువాత అర్థమైంది. ఈ మోసం మనీష్‌ను ఇబ్బందికి గురిచెయ్యడమే కాకుండా అతని మొత్తం కుటుంబాన్ని బాధపెట్టింది. ఎందుకంటే ఆ కుటుంబంలో మనీష్ ఒక్కడే సంపాదిస్తాడు.

సైబర్ మోసాలకు బలైన వారిలో మనీష్ కేసు ఒక్కటే కాదు.. ఇలాంటి మోసాలను ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. Money9 వ్యక్తిగత ఫైనాన్స్ సర్వే ప్రకారం.. దేశంలోని 100 కుటుంబాలలో ప్రతి 18 మంది కుటుంబాలు సైబర్ క్రైమ్‌ను ఎదుర్కొంటున్నారు. భారత్‌లో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని మనీ9 సర్వే వెల్లడించింది. ఇది 10 విభిన్న భాషల్లో 35,000 కంటే ఎక్కువ కుటుంబాల మధ్య నిర్వహించింది. సైబర్ క్రైమ్‌ను ఎదుర్కొన్న వారిలో 50% మంది ఆర్థిక మోసాల బారిన పడ్డారని, 25% మంది వ్యక్తిగత సమాచారం, గుర్తింపుకు సంబంధించి వేధింపులను ఎదుర్కొన్నారని, 12% కుటుంబాలు సోషల్ మీడియా ఖాతాలు లేదా మొబైల్ ఫోన్‌లను హ్యాకింగ్ చేయడం వంటి సంఘటనల బారిన పడ్డాయని సర్వే సూచిస్తోంది. అదనంగా, 13% మంది ఇతర రకాల సైబర్ నేరాలను ఫేస్ చేశారు.

పెరుగుతున్న సైబర్ క్రైమ్, సైబర్ మోసాలపై సర్వే ఫోకస్ పెట్టింది. సైబర్ మోసంగా పిలిచే ఆర్థిక మోసం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు స్పష్టమైంది. దాదాపు ప్రతిరోజూ దేశంలో ఎవరో ఒకరు సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వేల నుంచి లక్షల రూపాయల వరకు ప్రజలను మోసం చేస్తున్నారు. వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. వీటిలో డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు, UPI మోసాలు, కొరియర్ మోసాలు, ఇతర రకాల మోసాలు ఉన్నాయి. స్కామర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజలను దోపిడీ చేశారు.

ఇవి కూడా చదవండి

పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం, వేగవంతమైన ఇంటర్నెట్ మధ్య మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు లేదా తక్కువ డిజిటల్ అక్షరాస్యత ఉన్నవారు. వీళ్లు సైబర్ క్రైమ్ బాధితులుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది. సైబర్ క్రైమ్ పోలీసుల ప్రకారం.. దోపిడీ కేసులు పెరిగాయి. ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల నకిలీ గుర్తింపును వాడుతున్నారు. ఇది కాకుండా నకిలీ సైట్‌లను సృష్టించడం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించిన పనులు, లేదా ఆన్‌లైన్ వీడియో లేదా పోస్ట్ లైకింగ్‌లో కస్టమర్‌ని భాగం చేయడం, ఇంకా ఇతర రకాల రీఫండ్ స్కామ్‌లు.. ఇలా వివిధ రకాలుగా వివిధ మార్గాల్లో మోసాలు జరుగుతున్నాయి.

ప్రజలు ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయని సంఘటనలు చాలా ఉన్నాయి. బాధితులు… సైబర్ క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫైల్ చేయడమే దీనికి ఉదాహరణ. ఈ ప్లాట్‌ఫారమ్ గణాంకాల ప్రకారం.. జనవరి 2020, డిసెంబర్ 2022 మధ్య.. పోర్టల్‌లో సైబర్‌క్రైమ్‌పై 1.6 మిలియన్ ఫిర్యాదులు వచ్చాయి. అయితే వీటిలో 32,000 మాత్రమే పోలీసు కేసులుగా మారాయి.

మోసాల నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?

స్వీయ-అవగాహన చాలా కీలకమని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు గౌతమ్ కుమావత్ చెప్పారు. అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ స్కీమ్‌లను లేదా చేసిన వాగ్దానాలను నమ్మవద్దు. OTPని ఎవరితోనూ పంచుకోవద్దు. తెలియని కాలర్‌లను నమ్మవద్దు. ఏదైనా టెంప్టింగ్ ఆఫర్ గురించి తెలిసినా.. ఎవరి దగ్గరైనా విన్నా వంద ప్రశ్నలు అడగండి.. పూర్తి సమాచారంకోసం అడగండి. ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా లేదా ఫోన్ కాల్స్, మెసేజ్ లు లేదా ఈమెయిల్స్ ద్వారా సంప్రదించినప్పుడు… వెంటనే అలర్ట్ అవ్వండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి