Extra Income in Lockdown: మీకు అదనపు ఆదాయం కావాలా..! ఇలా చేయండి..! ఇక డబ్బే.. డబ్బు..!

|

May 20, 2021 | 6:20 PM

Business Ideas: కరోనా కారణంగా అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇందులో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో అదనపు ఆదాయం కావాలనుకునేవారికి ఆర్ధిక సలహాలు, సూచనలు. ఇవి తప్పకుండా కెరీర్‌కి ఉపయోగపడతాయి.

Extra Income in Lockdown: మీకు అదనపు ఆదాయం కావాలా..! ఇలా చేయండి..! ఇక డబ్బే.. డబ్బు..!
How To Earn Extra Income
Follow us on

కరోనా వైరస్ కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉంది. లాక్డౌన్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా ప్రభావితమైంది. అటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ తమ ఆదాయంపై లాక్‌డౌన్‌ ప్రభావితం పడకూడదని.. ఒక విధంగా అదనపు డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. మీరు కూడా ఈ రోజుల్లో ఇంట్లో ఉంటే అదనపు ఆదాయం కోసం ఒక ఆలోచన చేస్తుంటారు. లాక్‌డౌన్ సమయంలో మీరు ఎలా అదనపు సంపాదించవచ్చో ఈ రోజు మేము మీకు చెప్తాము.

కొన్ని ఆదాయ మార్గాలను చూపిస్తున్నాం. ఇందు కోసం మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని మంచి డబ్బు సంపాదించవచ్చు.  ఇన్‌కమ్ మీ ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ ప్రతిభ లేదా పని ప్రొఫైల్ ఆధారంగా ఒక ఆలోచనను ఎంచుకోవచ్చు. లాక్‌డౌన్‌ సమయంలో అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఈ మార్గాల గురించి తెలుసుకోండి…

మీరు YouTube నుంచి సంపాదించవచ్చు

మీరు యూట్యూబ్ నుంచి మంచి డబ్బును సంపాదించాలనుకుంటే.. దీని కోసం మీరు మీ కొన్ని వీడియోలను తయారు చేసి.. వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. వీటికి తోడు మీరు ముందుగా  కొన్ని టెక్నికల్ విషయాలను నేర్చుకోవ్సి ఉంటుంది. మీరు మీ అభిప్రాయాలను సులభంగా డబ్బుగా మార్చవచ్చు. మీ ప్రత్యేకమైన కంటెంట్ మీకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతంది. మీరు యూట్యూబ్ నుంచి సంపాదించిన వాటిలో 45 శాతం యూట్యూబ్‌కు వెళుతుంది. మిగిలిన 55 శాతం మీ వద్దకు వస్తుంది. మీ ఛానెల్‌లో వచ్చే ప్రకటనల ద్వారా ఈ ఆదాయం లభిస్తుంది. మీ వీడియోకు వచ్చే Youtube Views పెరిగేకొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది.

అన్ని రంగాల్లో ఫ్రీలాన్స్ ..

మీరు ఫ్రీలాన్స్ పని ద్వారా కూడా చాలా డబ్బును సంపాదించవచ్చు. చాలా మంది ఫ్రీలాన్సింగ్‌ను రెండో ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. అనేక రకాల ఫ్రీలాన్స్ పనులు మార్కెట్‌లో ఉన్నాయి. వీటిని మీ ప్రతిభ ఆధారంగా ఎంచుకోవచ్చు. మీకు ఫోటోగ్రఫీ వస్తే మీరు దీన్ని ఎంచుకోవచ్చు. ఇది కాకుండా, మీరు మంచి రచనలు చేసే అలవాటు ఉంటే వివిధ వెబ్ పోర్టల్స్‌కు రాయవచ్చు. దీనికి తోడు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, ప్రోగ్రామింగ్ ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. మీరు మీ నైపుణ్యం ప్రకారం ఏదైనా పనిని ముందుగా మొదలు పెడితే సరిపోతుంది. మీ ప్రతిభకు బదులుగా మీకు డబ్బు లభిస్తుంది.

ఆన్‌లైన్ క్లాసులు(Online tutoring.)…

ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల ద్వారా చదువుతున్నారు. మీరు ఇంతకు ముందు టీచింగ్ ఫీల్డ్‌లో ఉంటే… ఇది మీకు మంచి ఎంపికగా మారుతుంది. ఇది కాకుండా… మీకు ఏదైనా ఒక ఫీల్డ్ గురించి మంచి జ్ఞానం ఉంటే మీరు దానిని ఆన్‌లైన్ క్లాసులు మొదలు పెట్టవచ్చు. దీని కోసం మీరు మార్కెటింగ్ చేయవలసి ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని చదువుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

వెబ్‌సైట్ ద్వారా..

లాక్‌డౌన్ సమయంలో ప్రజలు విభిన్న ఆలోచనలతో వెబ్‌సైట్‌లను సృష్టించారు. వారి నుంచి కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఉదాహరణకు ఎవరైనా ఆన్‌లైన్ స్టార్టప్‌లు, ఆన్‌లైన్ పరీక్షలు, వెబ్‌సైట్‌ల వంటి స్టార్టప్‌లను మొదలు పెట్టారు. ఇలా వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నారు. మీ మనస్సులో ఏదైన అద్భుతమైన ఆలోచన ఉంటే… మీరు వెబ్‌సైట్ డిజైన్ చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు.

Corona Ayurveda medicine : ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు.. ప్రతీ జిల్లాలోనూ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారం..