అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్.. సామాన్య ఉద్యోగి తెలుసుకోవాల్సింది ఇదే

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్.. ఈ రెండింటిలో ఏది బెటర్. ఓ ఉద్యోగి తన కలను నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడతాడు. ఇక సొంతింటి విషయంలో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ బెటరా లేదా ఇండిపెండెంట్ హౌస్ బెటారా అనే దానిపై సందిగ్ధతలో ఉంటారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్.. సామాన్య ఉద్యోగి తెలుసుకోవాల్సింది ఇదే
Flat Vs House

Updated on: Jan 13, 2026 | 8:24 AM

సొంతింటి విషయంలో మిడిల్ క్లాస్ వ్యక్తి ఎప్పుడూ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలా..? లేదా ఇండిపెండెంట్ హౌస్ కొనాలా అనే అంశంపైనే ఆలోచిస్తుంటారు. దీనిపై బిజినెస్ నిపుణులు ఏమన్నారంటే.! గతంలో ప్రజలు ఎక్కువగా స్థలాలు కొనుక్కొని ఇళ్లు కట్టుకునేవారు. కానీ ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇల్లు కావాలా, అపార్ట్‌మెంట్ కావాలా అని అంటే రెండూ సరైనవే. అలాగే రెండూ తప్పు అని కూడా చెప్పోచ్చునని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

ఉదాహరణకు సంపన్నులు జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో కోట్లు వెచ్చించి ఇళ్లను కొనుగోలు చేయగలిగితే, సామాన్య ప్రజలకు అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. కోకాపేట లాంటి ప్రాంతాలలో భూమి ధరలు విపరీతంగా పెరగడంతో, ఫ్లాట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలకు గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్లు చక్కటి ఆప్షన్. అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయి. తాము ఉద్యోగం చేసే ప్రాంతాలకు దగ్గరలో.. లేదా పిల్లల పాఠశాలలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో తమ నివాసాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటారు. కాగా, కుటుంబ పరిస్థితులు, పలు అంశాలను పరిగణలోకి తీసుకుని, సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. సొంత స్థలం, ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ ఎంచుకునేటప్పుడు మీ వయస్సు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సభ్యుల అవసరాలు, ఉద్యోగం చేసే చోటు లాంటివి దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి