SMS, వాట్సాప్‌లో కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు! అది కూడా ఉచితంగా.. ఎలాగంటే?
ఇంటర్నెట్ లేకుండా మీ PF బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి మూడు సులభమైన మార్గాలు ఉన్నాయి. SMS ద్వారా 77382 99899 కి EPFOHO UAN [భాషా కోడ్] అని పంపండి. మిస్డ్ కాల్ ద్వారా 99660 44425 కి కాల్ చేయండి.

కొన్ని సార్లు పీఎఫ్ బ్యాలెన్సును ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం కొంత సవాలుగా మారింది. అయితే కంగారు పడకండి.. ఆన్‌లైన్ కాకుంటే ఆఫ్ లైన్‌లో కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేకుండానే SMS, మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ ఉపయోగించి మీరు మీ PF బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ లేకుండా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి.
మొదటి విధానం: SMS ద్వారా PF బ్యాలెన్స్ తనిఖీ చేయడం
మీరు మీ PF బ్యాలెన్స్‌ను మీకు నచ్చిన భాషలో టెక్స్ట్ సందేశం ద్వారా పొందవచ్చు. ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో SMS యాప్‌ను ఓపెన్ చేయండి. EPFOHO UAN ENG అని టైప్ చేసి 77382 99899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపండి. మీ రిజస్టర్ మొబైల్ నంబర్‌కు వెంటనే ఎస్‌ఎంఎస్ రూపంలో మీ PF బ్యాలెన్స్, ఇతర వివరాలు వచ్చేస్తాయి. అయితే EPFOHO UAN తర్వాత ఇంగ్లీష్‌లో సమాధానం కావాలంటే ENG అని, తెలుగులో కావాలంటే TEL అని టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే HIN – హిందీ, TAM – తమిళం, TEL – తెలుగు, MAR – మరాఠీ, BEN బెంగాలీ ఇలా మీకు కావాల్సిన భాషలోని మొదటి మూడు అక్షరాలు టైప్ చేయాలి.
రెండో విధానం: మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్ తనిఖీ చేయడం
మీరు ఉచిత మిస్డ్ కాల్ ద్వారా మీ EPF బ్యాలెన్స్ పొందవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 99660 44425 నంబర్‌కు డయల్ చేయండి. కాల్ ఆటోమేటిక్‌గా అదే కట్ అవుతుంది. అలా కాల్ కట్ అయిన తర్వాత మీ PF ఖాతా బ్యాలెన్స్, UAN వివరాలతో కూడిన SMS మీ మొబైల్‌కు వస్తుంది. (మీ UAN యాక్టివేట్ అయి, KYC (ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు) లింక్ పూర్తి అయితేనే ఈ సేవ పొందొచ్చు.)
మూడో విధానం: వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
చాట్‌బాట్ ద్వారా బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడానికి EPFO ప్రాంతీయ ఆధారిత వాట్సాప్ సేవను ప్రారంభించింది. EPFO వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ప్రాంతీయ కార్యాలయం WhatsApp నంబర్‌ను కనుగొనండి. ఆ నంబర్‌ను మీ కాంటాక్ట్‌లలో సేవ్ చేయండి. వాట్సాప్ తెరిచి “హాయ్” లేదా “పీఎఫ్ బ్యాలెన్స్” వంటి సందేశం పంపండి. చాట్‌బాట్ మీ ఖాతా వివరాలతో బ్యాలెన్స్, తాజా సహకారాలతో సహా ప్రతిస్పందిస్తుంది.
వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు, విద్య, పదవీ విరమణ లేదా నిరుద్యోగం కింద మీరు మీ పీఎఫ్ డబ్బును పాక్షికంగా లేదా పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. మీరు ఈ సేవలను పొందలేకపోతే, మీ HR/పేరోల్ విభాగాన్ని సంప్రదించండి లేదా 1800-118-005 (టోల్ ఫ్రీ) నంబర్‌లో EPFO హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి