ETF అనేది ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది నిఫ్టీ, సెన్సెక్స్ వంటి స్టాక్ మార్కెట్ సూచీలలో లేదా ఇండెక్స్ వెయిటేజీ ప్రకారం PSU, బ్యాంకింగ్ లేదా IT స్టాక్‌ల వంటి వివిధ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ రకం. కానీ ఇవి మ్యూచువల్ ఫండ్స్‌కు కొద్దిగా భిన్నంగా పనిచేస్తాయి. ఈటిఎఫ్‌ల కొనుగోలు, అమ్మకం ప్రక్రియ స్టాక్ ట్రేడింగ్ మాదిరిగానే ఉంటుంది. ఈటీఎఫ్‌లు ఆమోదించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ రిజిస్టర్డ్ బ్రోకర్ ద్వారా కొనుగోలు చేస్తారు. లేదా విక్రయిస్తారు. మీరు కూడా ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయాలనుకుంటే, ముందుగా బ్రోకర్‌తో డీమ్యాట్ ఖాతాను తెరవండి.ఆ తర్వాత డీమ్యాట్ ఖాతాను ట్రేడింగ్ ఖాతాకు లింక్ చేయడం ముఖ్యం.
ఈ EFTలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ పద్ధతిలో మార్కెట్ భద్రతను అందిస్తాయి. అలాగే అధిక రాబడిని కూడా అందిస్తాయి. అయితే పెట్టుబడి పెట్టడానికి ముందు ఈ ఇటిఎఫ్‌లను ఎక్కడ కొనవచ్చు? ఎక్కడ అమ్మవచ్చు? ఇటిఎఫ్‌లలో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కలిగి ఉండటం చాలా అవసరం.
ఇటిఎఫ్‌లను కొనడం, అమ్మడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి