Credit Card: క్రెడిట్ కార్డును ఎక్కడైనా పడేసుకున్నారా.? వెంటనే ఇలా చేయండి..

ఇదిలా ఉంటే నిత్యవసర వస్తువుగా మారిన క్రెడిట్ కార్డును ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లే రోజులు వచ్చేశాయ్‌. మరి ఒకవేళ పొరపాటున క్రెడిట్ కార్డును ఎక్కడైనా పడేసుకుంటే పరిస్థితి ఏంటి.? మరీ ముఖ్యంగా వైఫై ఎనేబుల్‌ ఉన్న కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్డులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది....

Credit Card: క్రెడిట్ కార్డును ఎక్కడైనా పడేసుకున్నారా.? వెంటనే ఇలా చేయండి..
Credit Card Loss
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 03, 2024 | 5:34 PM

ఒకప్పడు క్రెడిట్ కార్డ్‌ అంటే ప్రభుత్వ ఉద్యోగులు, భారీగా సంపాదించే వారికి మాత్రమే అనే భావనలో ఉండేవారు. కానీ ప్రస్తుతం బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ కారణంగా క్రెడిట్‌ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. చేతిలో డబ్బులు లేనప్పుడు, అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతీ చోట క్రెడిట్‌ కార్డులను అనుమతిస్తుండడం కూడా వీటి వినియోగం పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే నిత్యవసర వస్తువుగా మారిన క్రెడిట్ కార్డును ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లే రోజులు వచ్చేశాయ్‌. మరి ఒకవేళ పొరపాటున క్రెడిట్ కార్డును ఎక్కడైనా పడేసుకుంటే పరిస్థితి ఏంటి.? మరీ ముఖ్యంగా వైఫై ఎనేబుల్‌ ఉన్న కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్డులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే క్రెడిట్‌ కార్డు పోయిన వెంటనే మొబైల్‌లోనే కార్డును బ్లాక్ చేసే మార్గాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీ క్రెడిట్ కార్డు పోయిందని కాన్ఫామ్‌ చేసుకున్న వెంటనే మీ బ్యాంక్‌ కస్టమర్ కేర్‌కు చేయాలి. కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌కు కాల్‌ చేసి కార్డు కోల్పోయిన విషయాన్ని వివరించాలి. వారు అడిగిన సమాచారం అందిస్తే వంటెనే మీ కార్డును బ్లాక్‌ చేస్తారు. దీనికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు.

* ఇక నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీ కార్డును బ్లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం నెట్‌ బ్యాంకింగ్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత అందులో కార్డు లేదా సర్వీస్ అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి అనంతరం లాస్ట్‌ కార్డ్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకొని బ్లాక్ రిక్వెస్ట్​పై క్లిక్ చేయాలి. వెంటనే మీ కార్డ్‌ బ్లాక్‌ అవుతుంది.

* ఇక కొన్ని బ్యాంకులు ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా కూడా కార్డులను బ్లాక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మీ బ్యాంక్‌ ఈ సేవలను అందిస్తుంటే వెంటనే మీ రిజిస్టర్ మెుబైల్ నెంబర్ నుంచి బ్లాక్ అని టైప్ చేసి మీ బ్యాంకు ప్రొవైడ్ చేసిన నెంబర్​కు మెసేజ్ చేస్తే సరిపోతుంది.

* ఇవేవి కుదరకపోతే వీలైనంత త్వరగా మీ బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించాలి. కార్డు పోయిన వివరాలను బ్యాంక్‌ అధికారులకు వివరిస్తే వెంటనే మీ కార్డును బ్లాక్‌ చేస్తారు. ప్రైవేట్‌ బ్యాంకు యూజర్లైతే సొంత బ్రాంచ్‌ కావాల్సిన పనిలేదు, దగ్గరల్లో ఉన్నా ఏ బ్రాంచ్‌కు వెళ్లినా సేవలు అందిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..