AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Gold: ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉంది? ఇంట్లో ఎంత గోల్డ్ ఉంచుకోవచ్చు? నిబంధనలు ఏంటి?

RBI Gold: ఆర్బీఐ డేటా ప్రకారం.. భారతదేశ విదేశీ మారక నిల్వలలో (డాలర్లలో) బంగారం వాటా మార్చి 2021లో 5.87%గా ఉంది. ఇది మార్చి 2025లో 11.7%కి పెరిగింది. కేవలం నాలుగు సంవత్సరాలలో బంగారు ఆస్తులలో ఆర్బీఐ పెట్టుబడి రెట్టింపు అయింది..

RBI Gold: ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉంది? ఇంట్లో ఎంత గోల్డ్ ఉంచుకోవచ్చు? నిబంధనలు ఏంటి?
Subhash Goud
|

Updated on: May 17, 2025 | 4:08 PM

Share

భారతదేశంలో పెట్టుబడి పరంగా బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. బంగారం వందల సంవత్సరాలుగా దాని విలువ, ప్రాముఖ్యతను నిలుపుకుంది. దీనిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. భారతదేశంలోని చాలా మంది ఆర్థిక సలహాదారులు ప్రజలు తమ ఆస్తులలో కొంత బంగారం రూపంలో ఉంచుకోవాలని సలహా ఇస్తుంటారు.

భారతదేశ కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలి సంవత్సరాలలో బంగారం కొనుగోళ్లను పెంచింది. 2021 నుండి ఇప్పటి వరకు, RBI తన ఫారెక్స్ నిల్వలలో బంగారం వాటాను 25% పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. గత 3 సంవత్సరాలలో కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు 1,000 టన్నులకు పైగా బంగారాన్ని జోడించాయి.

2024లోనే ఆర్బీఐ 57.5 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. మార్చి 2025 నాటికి RBI వద్ద మొత్తం 879.59 టన్నుల బంగారం ఉంది. అందులో 511.99 టన్నులు భారతదేశంలో, మిగిలినవి ఇంగ్లాండ్, ఇతర ప్రదేశాలలో భద్రంగా ఉంది.

ఆర్బీఐ డేటా ప్రకారం.. భారతదేశ విదేశీ మారక నిల్వలలో (డాలర్లలో) బంగారం వాటా మార్చి 2021లో 5.87%గా ఉంది. ఇది మార్చి 2025లో 11.7%కి పెరిగింది. కేవలం నాలుగు సంవత్సరాలలో బంగారు ఆస్తులలో ఆర్బీఐ పెట్టుబడి రెట్టింపు అయింది. మే 9 నాటికి ఆర్బీఐ విదేశీ మారక నిల్వలు $690 బిలియన్లు, అందులో బంగారం విలువ $86 బిలియన్లు. దీని అర్థం భారతదేశ విదేశీ మారక నిల్వలలో దాదాపు 12.46% బంగారంలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Longest Train Journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం..21 రోజుల పాటు జర్నీ

ఇంట్లో ఎంత బంగారం ఉండొచ్చు?

మీరు ప్రకటించిన ఆదాయం నుండి కొనుగోలు చేసినట్లయితే, మీరు అపరిమిత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం..

  • వివాహిత స్త్రీ వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు.
  • అవివాహిత స్త్రీకి ఈ పరిమితి 250 గ్రాములు.
  • పురుష సభ్యునికి ఈ పరిమితి 100 గ్రాములు.

అయితే మీ దగ్గర దీని కంటే ఎక్కువ బంగారం ఉన్నప్పటికీ, ఆదాయపు పన్ను అధికారులు దానిని జప్తు చేయరు. అయితే అది కుటుంబ సంప్రదాయం లేదా ఇతర చట్టపరమైన మార్గాల ద్వారా సంపాదించినట్లయితే ఇబ్బంది ఉండదు. అయితే, మీ ఇంట్లో ఎక్కువ బంగారం ఉంటే, భయపడాల్సిన పని లేదు. కుటుంబ సంప్రదాయాలు, ఆచారాలతో సహా అనేక ప్రమాణాలను బట్టి, సోదాలు నిర్వహించే అధికారికి ఇంకా ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలను జప్తు చేయకూడదని చెప్పే అధికారం ఉంటుంది.

ఉదాహరణకు.. వివాహిత స్త్రీలు పిల్లల జననం, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి వివిధ సందర్భాలలో పొందిన అభరణాలు (బంగారం) సంవత్సరాలుగా సేకరించినట్లయితే భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలిక పెట్టుబడికి (గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్) ఒక అవకాశంగా పరిగణించవచ్చు. కానీ ఒకే పెట్టుబడిపై ఎక్కువగా ఆధారపడటం ప్రమాదకరం. ఆర్బీఐ లాగా బంగారం కొనడం తెలివైన పని కావచ్చు. కానీ మీ ఆర్థిక పరిస్థితి, పెట్టుబడి లక్ష్యాల ప్రకారం నిర్ణయం తీసుకోండి.

ఇది కూడా చదవండి: Android 16: స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పండగలాంటి వార్త.. ఆండ్రాయిడ్‌ 16 వచ్చేస్తోంది.. ముందుగా అప్‌డేట్‌ ఈ మొబైళ్లకు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి