చాలా మందికి ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందనే చాలా మందికి అనుమానం వస్తుంటుంది. ప్రభుత్వానికి ఉన్న ఖర్చులను సమకూర్చుకోవాలంటే ఎన్నో మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రభుత్వానికి ఆదాయాలను సమకూర్చుకోవాలి. ప్రజల నుంచి వివిధ రకాల పన్ను వళ్లూ, రవాణా వ్యవస్థలో జీఎస్టీ వసూళ్లు ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటుంది.
సాధారణ ప్రజల సంపాదనకు 3 మార్గాలున్నాయి:
1. ఉద్యోగం లేదా వ్యాపారం
2. అప్పు, రుణాలు తీసుకోవడం
3. దౌర్జన్యంగా గూండాలా దోచుకోవడం మామూళ్లు సుంకం వసూలు చేయడం
మనం చరిత్రలోకి వెళితే మామూళ్లు సుంకం కేవలం గూండాలు మాత్రమే వసూలు చేసేవారు కాదు. ప్రభుత్వ ప్రతినిధి కూడా సుంకం వసూలు చేస్తారు. కొందరు బలమైన రాజ్యాధినేతలు బలహీనమైన సామంతరాజులను భయపెట్టి వారి రాజ్యంలో వసూలయ్యే ధనంలో 1/4 వ వంతు సుంకంగా వసూలు చేసేవారు. వారు సామరస్యంగా సుంకం ఇస్తే తీసుకునే వారు లేదంటే దౌర్జన్యంగా వసూలు చేసుకునేవారు. మీకు ఇష్టం లేకపోయినా మీ నుండి పన్నులు వసూలు చేసే వ్యవస్థ ప్రభుత్వం. ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రజల నుండి వసూళ్ల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటుంది. వ్యక్తుల నుండి ఇన్ కమ్ ట్యాక్స్, కంపెనీల నుండి కార్నొరేట్ ట్యాక్స్,
విదేశాలనుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇంపోర్ట్ ట్యాక్స్ దిగుమతి సుంకం.. ఇలా వివిధ రకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ రిసీట్స్ అంటాం. ప్రభుత్వం క్యాపిటల్ రిసీట్స్ ద్వారా కూడా వసూళ్లు చేస్తుంది.
ప్రభుత్వానికి ప్రతినెలా క్రమబద్ధంగా వచ్చే ఆదాయం రెవెన్యూ రిసీట్స్. ప్రభుత్వ ఆస్తిని అమ్మడం ద్వారా సమకూరే ఆదాయం క్యాపిటల్ రిసీట్స్. ప్రభుత్వాలు చేసే ఖర్చులు, నష్టాలను భరించడానికి ఆస్తులు కూడా అమ్ముతుంది. పాకిస్థాన్ ప్రభుత్వం కార్యాలయాలు, ఎయిర్ పోర్టులు అమ్ముతోంది. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు అందుకే ఆస్తులను అమ్ముతోంది. ఓ ప్రభుత్వ ఆస్తిని అమ్మి ఇంకో ప్రభుత్వ ఆస్తిని కొంటే మంచిదే .. ప్రభుత్వ ఆస్తిని అమ్మి సమకూరిన నిధులతో వ్యాపారం లేదా ఏదైనా ఉత్పత్తి చేసి లాభం ఆర్జించిన పక్షంలో క్యాపిటల్ రిసీట్స్ మంచిదే.
ఉదాహరణ- 1: మీదగ్గర 5 ఇళ్లు ఉన్నాయి. మీకు ఉద్యోగం ద్వారా ప్రతి నెలా మంచి జీతం వస్తోంది. మీ ఇళ్లను అమ్మి వచ్చిన సొమ్మును క్యాపిటల్ రిసీట్స్ అంటాం. ఆ సొమ్మును షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి తిరిగి వాటిపై నిర్దిష్టమైన రిటర్న్స్ పొందితే క్యాపిటల్ రిసీట్స్. ఈ సంపాదన మంచిది నాణ్యమైనదే.
ఉదాహరణ-2: మీదగ్గర 5 ఇళ్లు ఉన్నాయి . మీరు ఉద్యోగం వ్యాపారం చేయాలని.. ఖర్చుల కోసం ఉన్న ఇళ్లు అమ్మితే వచ్చేది కూడా క్యాపిటల్ రిసీట్స్ అంటాం. అయితే ఈ సొమ్మును ఉత్పాదకంగా వినియోగించకుండా ఖర్చు చేస్తే మీ ఆస్తులు ఎంత ఉన్నా కరిగిపోతాయి. ఇలాంటి క్యాపిటల్ రిసీట్స్ సంపాదన సరికాదు. కొత్త ఆదాయ సంపాదన మార్గాలు సృష్టించుకోలేక పోతే కేవలం క్యాపిటల్ రిసీట్స్ ఆదాయంపై ఆధారపడకూడదు.
ఏదైనా అవసరంలేని ఆస్తిని అమ్మవచ్చు. దాన్ని నగదుగా మార్చే ఎక్కడైనా పెట్టుబడి దాని ద్వారా నిర్దిష్టమైన ఆదాయం పొందుతూ ఉంటే .. ఈ వ్యక్తి అయినా, ప్రభుత్వ మైనా రెవెన్యూ రిసీట్స్‌లో వృద్ధి కలిగి, నిరుపయోగమైన ఆస్తిని అమ్మి దాన్ని మెరుగైన పెట్టుబడిగా వాడితే అది మంచి బడ్జెట్ అవుతుంది. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలకు ఆదాయం లేదు. జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వ ఆస్తులను, ఎయిర్ పోర్ట్ లను, ఎంబసీ కార్యాలయాలను అమ్ముతోంది. ప్రస్తుతం పాకిస్థాన్ తాగుడుకు బానిసై ఆస్తులను అమ్ముకుంటున్న వ్యక్తి లాంటిదే. ఇలాంటి వారికి చివరికి దివాలయే దిక్కు. మన పూర్వీకులు మంచి ఆస్తులను వదిలి వెళ్లినప్పటికీ మనం కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కోవాల్సిందే. ఆస్తి అవసరమైతే ఉంచుకోవాలి. లేదంటే అమ్మి మరో ఉపయోగకరమైన రాబడి వచ్చే పెట్టుబడిలో పెట్టాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి