హోండా యాక్టివా.. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటి. తాజాగా హోండా కంపెనీ దీని అప్‌డేటడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హోండా యాక్టివా 6జీ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్‌లో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో 109.51cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 7.79 హార్స్‌పవర్, 8.79 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎన్-హ్యాండ్ పవర్ టెక్నాలజీ సైతం ఈ యాక్టివాలో ఉంది.
LED హెడ్‌ల్యాంప్, టెయిల్‌లైట్, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ స్విచ్, కాంబబి బ్రేకింగ్ సిస్టమ్ లాంటి సరికొత్త ఫీచర్లు ఈ హోండా యాక్టివాలో ఉన్నాయి. మరి ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న.. ఈ స్కూటర్‌ను మీరు రూ. 18 వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగంటే.!
హోండా యాక్టివా 6జీ రెగ్యులర్ రేడియంట్ ఆన్-రోడ్డు ధర రూ. 86,800(ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీనికి లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అలాగే డౌన్ పేమెంట్ కూడా ఎక్కువ ఇవ్వవచ్చు. అటు లోన్ కాలపరిమితిని 1 నుంచి 7 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. అలాగే వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. మీరు 3 ఏళ్ల కాలపరిమితితో లోన్ తీసుకున్నట్లయితే.. డౌన్ పేమెంట్ రూ. 18000, ప్రతి నెలా రూ. 2222 ఈఎంఐ చెల్లించాలి. దీన్ని బట్టి చూస్తే.. లోన్ మొత్తంతో పాటు మీరు అదనంగా రూ. 11 వేలు చెల్లించాల్సి ఉంటుంది.