Home Loan: ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే గృహ రుణాలు.. రూ.75 లక్షల తీసుకుంటే ఈఎంఐ ఎంతో తెలుసా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమావేశాన్ని (ఎంపీసీ) ప్రారంభించినప్పుడల్లా చాలా మంది సామాన్యులు రెపో రేటు నిర్ణయంపై దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది వారి హోమ్ లోన్ ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలపై (ఈఎంఐల) ప్రభావం చూపుతుంది. రెపో రేటు అనేది ఆర్‌బిఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. రెపో రేటు ఎక్కువగా ఉన్నప్పుడు, రుణదాతలు గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతారు. ఇది గృహ రుణ గ్రహీతలకు అధిక ఈఎంఐకు దారి తీస్తుంది. శుక్రవారం ఆర్‌బీఐ రెపో రేటు విషయంలో కీలక చర్యలను తీసుకుంది.

Home Loan: ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే గృహ రుణాలు.. రూ.75 లక్షల తీసుకుంటే ఈఎంఐ ఎంతో తెలుసా..?
Bank Home Loan
Follow us

|

Updated on: Jun 07, 2024 | 5:15 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమావేశాన్ని (ఎంపీసీ) ప్రారంభించినప్పుడల్లా చాలా మంది సామాన్యులు రెపో రేటు నిర్ణయంపై దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది వారి హోమ్ లోన్ ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలపై (ఈఎంఐల) ప్రభావం చూపుతుంది. రెపో రేటు అనేది ఆర్‌బిఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. రెపో రేటు ఎక్కువగా ఉన్నప్పుడు, రుణదాతలు గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతారు. ఇది గృహ రుణ గ్రహీతలకు అధిక ఈఎంఐకు దారి తీస్తుంది. శుక్రవారం ఆర్‌బీఐ రెపో రేటు విషయంలో కీలక చర్యలను తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ వంటి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్ానియ. ఈ నేపథ్యంలో రూ. 75 లక్షల గృహ రుణంపై అందించే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్‌బీఐ 8.50 శాతం-9.85 శాతం పరిధిలో రూ. 75 లక్షల రుణాన్ని అందిస్తోంది. అంటే 20 సంవత్సరాల గృహ రుణం కోసం మీ ఈఎంఐ రూ. 65,087 మరియు రూ. 71,633 మధ్య ఉండవచ్చు. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్

పీఎన్‌బీ రూ. 75 లక్షలు, 8.40 శాతం నుంచి 10.15 శాతం వడ్డీ రేట్ల పరిధిలో 20 సంవత్సరాల రుణాన్ని అందిస్తోంది. 20 సంవత్సరాల లోన్ కోసం మీ ఈఎంఐ రూ. 64,613 మరియు రూ. 73,124 మధ్య ఉండవచ్చు. 

ఇవి కూడా చదవండి

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ 8.45 శాతం నుంచి 11.25 శాతం పరిధిలో రూ. 75 లక్షల గృహ రుణాన్ని అందిస్తోంది. ఆ రేటుతో, రుణగ్రహీతకు సంబంధించిన గృహ రుణ ఈఎంఐ 20 సంవత్సరాల రుణానికి రూ. 64,850 నుంచి రూ. 78,694 మధ్య ఉంటుంది. 

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ తన రూ. 75 లక్షల గృహ రుణాన్ని 8.75 శాతం వడ్డీ రేటుతో ప్రారంభిస్తుంది. అంటే 20 సంవత్సరాల లోన్ కోసం కనీసం రూ. 66,278 ఈఎంఐ చెల్లించాలి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

భారతదేశంలో అతిపెద్ద రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ తన గృహ రుణ వడ్డీ రేటును 8.75 శాతం వద్ద ప్రారంభించింది. అటువంటి సందర్భంలో 20 సంవత్సరాల రుణానికి కనీస ఈఎంఐ రూ. 66,278 అవుతుంది.

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ తన రూ. 75 లక్షల రుణాన్ని 8.75 శాతం నుంచి 13.30 శాతం పరిధిలో అందిస్తుంది. అటువంటప్పుడు, 20 సంవత్సరాల రుణం కోసం ఈఎంఐ రూ. 66.278 నుంచి రూ. 89,476 పరిధిలో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..