IPO Alert: మార్కెట్ లోకి మరో కొత్త ఐపీఓ వచ్చేస్తోంది. తాజాగా హెక్సాగాన్ న్యూట్రిషన్(Hexagon Nutrition) అనే సంస్థ రూ. 600 కోట్ల ఐపీఓకు సెబీ(SEBI) అనుమతి ఇచ్చింది. 2021 డిసెంబర్ లో సంస్థ ఇందుకోసం దరఖాస్తు చేసుకుంది. ప్రాస్పెక్టస్ లో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం రూ. 100 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ కూడా ఇందులో ఉండనుందని తెలుస్తోంది. అంటే సుమారు 3 కోట్లకు పైగా షేర్లు దీని ద్వారా రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఓ ద్వారా వచ్చే మెుత్తాన్ని కంపెనీ అప్పులు చెల్లించేందుకు వినియోగించనుంది. దీనికి తోడు కంపెనీ రోజువారీ అవసరాలు, క్యాపిటల్ ఎక్సెండిచర్, కంపెనీ అభివృద్ధి, సబ్డిడరీ కంపెనీల్లో పెట్టుబడి అవసరాలు, కంపెనీ మూలధన అవసరాలకోసం ఈ మెుత్తాన్ని వినియోగించనుంది.
కంపెనీ గురించి కొన్ని వివరాలు..
హెక్సాగాన్ న్యూట్రిషన్ కంపెనీ ముంబయి నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది ఉత్పత్తి అభివృద్ధి, మార్కెటింగ్, అలాగే పరిశోధన& అభివృద్ధి, పోషకాహార తయారీలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ కంపెనీని 1993లో అరుణ్, సుభాష్ కేల్కర్ సంయుక్తంగా స్థాపించారు. ఈ కంపెనీ మైక్రోన్యూట్రియెంట్ ఫార్ములేషన్స్ వ్యాపారంతో ప్రారంభమైంది. దీనికి తోడు ప్రస్తుతం పెంటాసూర్, ఒబెసిగో మరియు పెడియాగోల్డ్ వంటి బ్రాండ్‌ల ద్వారా ఆరోగ్యం, వెల్ నెస్, క్రినికల్ న్యూట్రిషన్ రంగాల్లో తన ఉత్పత్తులను విస్తరించింది.
ఇవీ చదవండి..
Navi IPO: మెగా ఐపీఓతో ముందుకొస్తున్న నావీ.. 97 శాతం వాటా కలిగి ఉన్న ఫిప్ కార్ట్ సహవ్యవస్థాపకుడు..
Multibagger Penny Stocks: ఒక్క నెలలోనే అన్ని లాభాలా.. ఆ 3 కంపెనీలు సూపర్..
Black Stone: అత్యధిక జీతం తీసుకునేవాళ్లలో ఆయనే తోపు.. ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..